- Telugu News Photo Gallery Cinema photos Is Heroine Sai Pallavi Not Ready To Act With Star Heroes Telugu Actress Photos
Sai Pallavi: లేడీ పవర్ స్టార్ కి స్టార్ హీరోలతో నటించడానికి ఆసక్తి లేదా.?
హీరోయిన్స్ అంతా ఎప్పుడెప్పుడు స్టార్ హీరోలతో జోడీ కడదామా..? ఎప్పుడెప్పుడు టాప్ ప్లేస్‌కు వెళ్లిపోదామా అని వేచి చూస్తుంటారు. ఒక్కసారి స్టార్స్‌తో నటించే అవకాశం కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తుంటారు. కానీ సాయి పల్లవి మాత్రం డిఫెరెంట్. ఇన్నేళ్లుగా స్టార్ హీరోలకు దూరంగానే ఉన్నారీమె. ఇప్పటికీ పల్లవి చూపులు మీడియం రేంజ్ హీరోలపైనే ఉండటానికి కారణమేంటి..? ఒక్క సినిమా చాలు..
Updated on: May 19, 2024 | 5:16 PM

హీరోయిన్స్ అంతా ఎప్పుడెప్పుడు స్టార్ హీరోలతో జోడీ కడదామా..? ఎప్పుడెప్పుడు టాప్ ప్లేస్‌కు వెళ్లిపోదామా అని వేచి చూస్తుంటారు. ఒక్కసారి స్టార్స్‌తో నటించే అవకాశం కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తుంటారు.

కానీ సాయి పల్లవి మాత్రం డిఫెరెంట్. ఇన్నేళ్లుగా స్టార్ హీరోలకు దూరంగానే ఉన్నారీమె. ఇప్పటికీ పల్లవి చూపులు మీడియం రేంజ్ హీరోలపైనే ఉండటానికి కారణమేంటి..? ఒక్క సినిమా చాలు.. ఆడియన్స్ గుండెల్లో అలా ఉండిపోడానికి..!

సాయి పల్లవికి ఫిదా అలాంటి సినిమానే. చేసింది తక్కువ సినిమాలే అయినా.. లేడీ పవర్ స్టార్ అనే బిరుదు సొంతం చేసుకున్నారు ఈ బ్యూటీ. అనుకుంటే ఏ స్టార్ హీరోతో అయినా నటించొచ్చు గానీ ఎందుకో మరి సాయి పల్లవి మాత్రం ఎప్పుడూ మీడియం రేంజ్ హీరోలతోనే నటిస్తుంటారు. ఇప్పుడూ ఇదే చేస్తున్నారు.

దీన్ని బట్టి ఈ ఇయర్ ఎండింగ్ నుంచీ ప్రతి అకేషన్‌కీ ఏదో ఒక రకంగా పలకరిస్తూనే ఉంటారన్నమాట ఈ బ్యూటీ.

అలాగే తమిళంలో శివకార్తికేయన్‌తో అమరన్.. హిందీలో అమీర్ తనయుడితో ఓ సినిమా.. రణ్‌బీర్‌తో రామాయణం సినిమాలు చేస్తున్నారు. తెలుగులో సాయి పల్లవి మరో సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది.

విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కోలా తెరకెక్కించబోయే రూరల్ డ్రామాలో సాయి పల్లవిని తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. దిల్ రాజుతో గతంలో ఫిదా, ఎంసిఏ సినిమాలు చేసారు పల్లవి.

తాజాగా విజయ్ సినిమాతో హ్యాట్రిక్ పూర్తి చేయాలని చూస్తున్నారు. మొత్తానికి ఈ కథకు సాయి పల్లవి ఓకే చెప్పారంటే మాత్రం.. సమ్‌థింగ్ స్పెషల్ ఉన్నట్లే.




