Hollywood: ట్రెండ్ మారింది.. హోలీవడ్ స్టార్స్‌కే ఛాన్స్ ఇస్తాం అంటున్న ఇండియన్ మేకర్స్…

| Edited By: Prudvi Battula

Jul 13, 2024 | 12:58 PM

రీజినల్ సినిమాలో ప్రూవ్ చేసుకున్న తారలు బాలీవుడ్ వైపు చూడటం, బాలీవుడ్‌లో సక్సెస్‌ అయిన స్టార్స్‌ హాలీవుడ్‌ వైపు చూడటం... ఇదంతా గతం. ఇప్పుడు మన సినిమాల్లో హాలీవుడ్ స్టార్స్‌కు ఛాన్స్ ఇస్తున్నారు మేకర్స్‌. కథ డిమాండ్ చేస్తే ఇంటర్నేషనల్‌ స్టార్స్‌ను రంగంలోకి దించేందుకు కూడా రెడీ అంటున్నారు.

1 / 5
 ప్రజెంట్‌ డిస్కషన్స్‌లో ఉన్న సినిమాల్లో హాలీవుడ్ తారల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. మహేష్‌ - రాజమౌళి కాంబో మూవీని గ్లోబల్ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్‌. అందుకే కాస్టింగ్‌ను కూడా అదే రేంజ్‌లో సెట్ చేస్తున్నారు. ఇంకా పేర్లు బయటకు రాకపోయినా... ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్స్ కీ రోల్స్‌లో కనిపించటం ఖాయంగానే కనిపిస్తోంది.

2 / 5
 జక్కన్న ట్రిపులార్‌ కోసం కూడా ఓ హాలీవుడ్‌ బ్యూటీని పట్టుకొచ్చారు. భీమ్‌తో ప్రేమకథతో పాటు కథను మలుపు తిప్పే కీలకమైన జెన్నిఫర్ పాత్రలో ఒలివియా మోరిస్ నటించారు. ఈ సినిమా తరువాత ఒలియాకు హాలీవుడ్‌లో కూడా ఆఫర్స్‌ పెరిగాయి.

3 / 5
 కల్కి 2898 ఏడీ సక్సెస్‌తో గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ప్రభాస్‌ కూడా నెక్ట్స్ మూవీ కోసం ఇంటర్నేషనల్‌ స్టార్‌ను రంగంలోకి దించుకున్నారు. సందీప్‌ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తున్న స్పిరిట్ సినిమాలో కొరియన్ స్టార్‌ మా డొంగ్ సాక్‌ విలన్‌గా నటిస్తారన్న టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే స్పిరిట్ సినిమా కొరియాలోనూ భారీగా రిలీజ్ అవ్వటం ఖాయం.

4 / 5
 ఈ ట్రెండ్‌ను సూపర్ స్టార్ రజనీకాంత్ ఎప్పుడో స్టార్ట్ చేశారు. రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ డ్రామా కబాలి. ఈ సినిమాలో విలన్‌గా టోని లీ పాత్రలో చైనీస్ స్టార్‌ విన్‌స్టన్ చావ్ నటించారు. ఆయన ప్రజెన్స్ సినిమాకు మరింత హైప్ తీసుకువచ్చింది.

5 / 5
సూర్య హీరోగా మురుగదాస్ తెరకెక్కించిన సెవెన్త్ సెన్స్ సినిమాలోనూ ఓ విదేశీ నటుడు ఆకట్టుకున్నాడు. హాలీవుడ్‌లో సెటిల్‌ అయిన వియత్నాం నటుడు జానీ ట్రై న్గుయెన్ సూర్యతో పోటి పడి నటించి మెప్పించారు. ఇప్పుడు సినిమాలు పాన్ ఇండియా దాటి గ్లోబల్ రేంజ్‌కు వెళుతుండటంతో మన సినిమాల్లో విదేశీ నటుల సంఖ్య కూడా పెరుగుతోంది.