
స్క్రీన్ మీద మేజిక్ జరిగితే లాజిక్కులు ఎవరూ పట్టించుకోరబ్బా అనే మాట ఫిల్మ్ సర్కిల్స్ లో చాలా సార్లు వింటుంటాం. స్క్రీన్ మీద మేజిక్ జరిగితేనే కాదు, చేస్తారనే నమ్మకం ఉంటే కూడా చాలా విషయాలను పట్టించుకోరు జనాలు.

కొన్ని కాంబినేషన్లు జస్ట్ అలా కలిస్తే చాలని కలలు కంటుంటారు. అలాంటి ఎవర్‌గ్రీన్ కాంబో త్రివిక్రమ్ అండ్ అల్లు అర్జున్. వీరిద్దరి సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ వార్త ఒకటి వినిపిస్తోంది.

అల వైకుంఠపురములో చిత్రం తో బన్నీ అండ్ త్రివిక్రమ్ జాయింట్‌గా హ్యాట్రిక్ హిట్ రిజిస్టర్ చేసుకున్నారు. బిఫోర్ ప్యాండమిక్ ఆ సినిమా జనాలను ఓ ఊపు ఊపేసింది.

వీరిద్దరు కలిస్తే స్క్రీన్ మీద చేసే సిత్తరాలు అన్నీ ఇన్నీ కావని ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసింది. ముచ్చటగా హ్యాట్రిక్ కొట్టిన ఈ ఇద్దరు ఇప్పుడు ఇంకో హ్యాట్రిక్‌కి నాంది పలక బోతున్నారు.

ఆ సినిమా షూటింగ్ ఈ సెప్టెంబర్ నుంచే ఉంటుందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ పూర్తిగా కథ మీద ఫోకస్ చేస్తున్నారట. సెప్టెంబర్ లోపు ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసేస్తారని సమాచారం.

జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి , అల వైకుంఠపురములో సినిమాలను మించేలా ఉండబోతోందట నెక్స్ట్ మూవీ కాన్సెప్ట్. ఆల్రెడీ ప్యాన్ ఇండియా ఇమేజ్‌తో దూసుకుపోతున్నారు బన్నీ. ఇప్పుడు ఆయన చేస్తున్న పుష్ప సీక్వెల్ కూడా ఆగస్ట్ 15న విడుదలవుతుంది.

ఆ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకునే గురూజీ మొత్తం ఎలివేషన్స్ నీ రాసుకుంటున్నారట. త్రివిక్రమ్ డైలాగులు బన్నీ నోటెంట వింటుంటే ఆ థ్రిల్లే వేరబ్బా అన్నది అల్లు ఆర్మీ మాట.

నెక్స్ట్ మూవీలో అంతకు మించిన లైన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు అభిమానులు. తమ కాంబినేషన్ అనగానే ఎలాంటి విషయాలను జనాలు ఎక్స్ పెక్ట్ చేస్తారో ఊహించిన త్రివిక్రమ్, వాటన్నిటినీ కన్సిడర్ చేస్తారనడంలో అనుమానాలేం అక్కర్లేదనే చర్చ జరుగుతోంది ఫిల్మీ సర్కిల్స్ లో.