
హార్రర్ విత్ కామెడీ.. అప్పట్లో సెన్సేషనల్ కాంబినేషన్ ఇది. ఇప్పుడైతే ఇదే ట్రెండ్. ఊళ్లో జరిగే దెయ్యాల కథల వైపు అడుగులేస్తున్నారు. తాజాగా ఓం భీమ్ బుష్ కూడా అనగనగా ఓ ఊళ్లో దెయ్యం కథే. శ్రీ విష్ణు హీరోగా హర్ష తెరకెక్కించిన ఈ చిత్రంలో కామెడీకి ఢోకా లేదు. సామజవరగమనా తర్వాత శ్రీ విష్ణు కెరీర్‌కు మరింత బలంగా పునాది వేసింది ఓం భీమ్ బుష్.


ఆ మధ్య సూపర్ హిట్టైన మా ఊరి పొలిమేర 2 కథ కూడా ఒకే ఊరిలో జరుగుతుంది.. చేతబడులే ఇందులో మెయిన్ స్టోరీ. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇది మా ఊరి పొలిమేర మూవీకి సీక్వెల్ గా వచ్చింది ఈ చిత్రం.

సాయి ధరమ్ తేజ్ కమ్ బ్యాక్ సినిమా విరూపాక్షలోనూ చేతబడులే ఉన్నాయి. రెండేళ్ల కింద బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో వచ్చిన మసూధ బ్లాక్‌బస్టర్ అయింది. మొన్నొచ్చిన అనన్య నాగళ్ల తంత్రలోనూ ఉన్నవన్నీ దెయ్యాలే. ఈ సినిమాలు చూసాక.. చాలా మంది దర్శకుల కన్ను హార్రర్ డ్రామాస్ వైపు వెళ్తుంది. తాజాగా ఓం భీమ్ బుష్‌తో ఈ ట్రెండ్‌కు మరింత ఊపొచ్చింది.

తాజాగా కోన వెంకట్ కంపెనీ నుంచి వస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చిందిలోనూ దెయ్యమే మెయిన్. ఇక దిల్ రాజు వారసుడు ఆశిష్ రెడ్డి హీరోగా నటిస్తున్న లవ్ మీ సినిమాలోనూ ఘోస్ట్ లవ్ స్టోరీ చెప్పబోతున్నారు మేకర్స్. ఈ రెండు సినిమాలపై ఆసక్తి పెరగడానికి కారణం ఘోస్ట్ స్టోరీస్ కావడమే.