Movie Updates: హాయ్ నాన్న చిత్రానికి అదిరిపోయే బిజినెస్.. ఈగల్ సాంగ్ రిలీజ్..

| Edited By: Prudvi Battula

Dec 08, 2023 | 10:39 AM

హాయ్ నాన్న సినిమా కోసం తెగ కష్టపడ్డారు నాని. హృతిక్ రోషన్, దీపికా పదుకొనే జంటగా సిద్దార్ధ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న సినిమా ఏరియల్ యాక్షన్ డ్రామా ఫైటర్.  రవితేజ హీరోగా కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న సినిమా ఈగల్. దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో వరస సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్‌గానే ఉన్నారు. రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా యానిమల్ సినిమా 5 రోజుల్లోనే 450 కోట్ల మార్క్ అందుకుంది.

1 / 5
హాయ్ నాన్న సినిమా కోసం తెగ కష్టపడ్డారు నాని. ఈ సినిమాకు ఒకరోజు ముందుగానే ప్రీమియర్లు ప్లాన్ చేసారు దర్శక నిర్మాతలు. ఇదిలా ఉంటే ఈ చిత్ర డిజిటల్ బిజినెస్ కూడా మరో స్థాయిలో జరుగుతుంది. ఓ ప్రముఖ ఓటిటి సంస్థ అన్ని భాషలకు కలిపి హాయ్ నాన్న హక్కులను 37 కోట్లకు తీసుకున్నట్లు తెలుస్తుంది. అలాగే ఆడియో రైట్స్ సైతం 9 కోట్లకు సొంతం చేసుకుంది ఓ ప్రముఖ ఆడియో సంస్థ.

2 / 5
హృతిక్ రోషన్, దీపికా పదుకొనే జంటగా సిద్దార్ధ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న సినిమా ఏరియల్ యాక్షన్ డ్రామా ఫైటర్. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన హృతిక్ రోషన్ ఫస్ట్ లుక్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో అనిల్ కపూర్, అక్షయ్ ఒబెరాయ్, సంజీదా షేక్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2024 జనవరి 25న విడుదల కానుంది ఫైటర్. ఈ సినిమాను 3డిలో తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

3 / 5
రవితేజ హీరోగా కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న సినిమా ఈగల్. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. రిలీజ్ డేట్ దగ్గరికి వస్తుండటంతో ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమా నుంచి ఆడు మచ్చా అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదలైంది. జనవరి 13న విడుదల కానుంది ఈగిల్.

4 / 5
దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో వరస సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్‌గానే ఉన్నారు. తెలుగులోనూ దేవరతో ఎంట్రీ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే కొన్నాళ్లుగా ఈమె శ్రీకర్ పహారియాతో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈయనతో కలిసి ఉజ్జయిన్‌లోని మహాకాళేశ్వర్ గుడిని సందర్శించారు జాన్వీ. ఈ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

5 / 5
రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా యానిమల్ సినిమా 5 రోజుల్లోనే 450 కోట్ల మార్క్ అందుకుంది. ఈ సినిమాతో సందీప్ వంగా బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయారు. ముందు నుంచి యానిమల్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. 500 కోట్ల వైపు దూసుకుపోతున్నాడు యానిమల్. ఫుల్ రన్‌లో 700 కోట్ల వరకు వసూలు చేస్తుందని ప్రచారం జరుగుతుంది.