5 / 5
కరోనా టైమ్‌లో స్టార్ హీరోయిన్స్ అంతా ఓటిటి వైపు వెళ్లారు. కానీ డిజిటల్ మార్కెట్ దారుణంగా పడిపోయిందిప్పుడు. ముందులా రైట్స్ సేల్ అవ్వట్లేదు. పైగా శ్రీలీల లాంటి వాళ్లేమో ఒక్క సీజన్‌కే పరిమితమవుతున్నారు. ఏ హీరోయిన్‌కు స్టాండర్డ్ మార్కెట్ లేదు. పూజా హెగ్డే, సమంత, తమన్నా ముందులా మెరవట్లేదు. అందుకే ఒకప్పట్లా హీరోయిన్లకు కోట్లు సమర్పించడానికి నిర్మాతలు సిద్ధంగా లేరు.