
ఎప్పుడూ అబ్బాయిలే లవ్‌లో ఫెయిల్ అవ్వాలా? ఏం అమ్మాయిలు కాకూడదా? రిలేషన్‌షిప్స్ గురించి అమ్మాయిలకు ఒపీనియన్ ఉండకూడదా? అని సూటిగా ప్రశ్నిస్తున్నారు బెంగుళూరు బ్యూటీ నిత్యామీనన్.

ఉన్నట్టుండి ఈ లేడీకి ఇన్ని డౌట్స్ ఎందుకు వస్తున్నాయని అంటారా? అన్నిటినీ ఓ రీజన్ ఉందండోయ్.! సూటిగా మాట్లాడటం నాకు అలవాటు అని అంటున్నారు నిత్యామీనన్.

కథలు నచ్చినా, నచ్చకపోయినా మొహమాటానికి సినిమాలు చేసే అలవాటు తనకు మొదటి నుంచీ లేదంటారు మిస్ నిత్య. నిత్యామీనన్ ఓ సినిమాకు సైన్ చేశారంటేనే, అందులో ఏదో డిఫరెంట్ కంటెంట్ ఉందని అర్థం.

తనతో పాటు ఎంత మంది హీరోయిన్లు స్క్రీన్ పంచుకున్నా డోంట్ కేర్ అనే యాటిట్యూడ్ ఆమె సొంతం. అందుకే ఆమె కిట్టీలో చాలా తక్కువ సినిమాలే ఉంటాయి. ఆచితూచి సినిమాలు సెలక్ట్ చేసుకోవడం ఓ కళ అని అంటారు నిత్య.

లేటెస్ట్ గా ఆమె ఓ సినిమాకు సైన్ చేశారు. అందులో లవ్ ఫెయిల్యూర్ అయిన అమ్మాయిగా కనిపిస్తారు. రిలేషన్‌షిప్స్ ని నేటి తరం అమ్మాయిలు ఎలా చూస్తున్నారన్న విషయం మీద ఈ సినిమాలో డిస్కషన్ ఉంటుంది.

ఒకప్పటితో పోలిస్తే, ఇప్పుడు చాలా మంది సెన్సిటివ్ సబ్జెక్టులతో వస్తున్నారన్నది నిత్య అభిప్రాయం. మంచి కంటెంట్ ఉన్నప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి తనకెలాంటి ఇబ్బందీ లేదంటారు ఈ లేడీ.

థియేట్రికల్ రిలీజ్ అయినా, డిజిటల్ స్ట్రీమింగ్ అయినా పట్టించుకోరు ఈ బ్యూటీ. లాంగ్వేజ్ బేరియర్స్ అసలే లేవన్నది మొదటి నుంచి నిత్య ఫిలాసఫీ.