- Telugu News Photo Gallery Cinema photos Heroine Anupama Parameswaran Upcoming Movies Update after tillu square success Telugu Actress Photos
Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ రూట్ ఎటు.? హిట్స్ ఉన్న ఛాన్సులు లేవా.?
కొత్త గ్లామర్ ఇమేజ్ అనుపమ పరమేశ్వరన్‌కు వర్కవుట్ కాలేదా.? గ్లామర్ క్వీన్ కారెక్టర్స్‌కు ఈమె సరిపోదని దర్శక నిర్మాతలు భావిస్తున్నారా.? ఎందుకు టిల్లు స్క్వేర్ లాంటి విజయం తర్వాత కూడా అనుమపకు తెలుగులో ఆఫర్స్ రావట్లేదు..? టిల్లు గాడు తెచ్చిన గ్లామర్ ఇమేజ్.. అనుపమ పరమేశ్వరన్‌ను కన్ఫ్యూజన్‌లో పడేసిందా..? ఇండస్ట్రీలో హోమ్లీ ఇమేజ్ రావాలంటే టైమ్ పడుతుంది కానీ గ్లామర్ క్వీన్ అనే ముద్ర రావాలంటే ఎంతసేపు.. ఒక్క సినిమా చేసినంత సేపంతే.
Updated on: Aug 16, 2024 | 3:22 PM

కొత్త గ్లామర్ ఇమేజ్ అనుపమ పరమేశ్వరన్‌కు వర్కవుట్ కాలేదా.? గ్లామర్ క్వీన్ కారెక్టర్స్‌కు ఈమె సరిపోదని దర్శక నిర్మాతలు భావిస్తున్నారా.?

ఎందుకు టిల్లు స్క్వేర్ లాంటి విజయం తర్వాత కూడా అనుమపకు తెలుగులో ఆఫర్స్ రావట్లేదు..? టిల్లు గాడు తెచ్చిన గ్లామర్ ఇమేజ్.. అనుపమ పరమేశ్వరన్‌ను కన్ఫ్యూజన్‌లో పడేసిందా..?

ఇండస్ట్రీలో హోమ్లీ ఇమేజ్ రావాలంటే టైమ్ పడుతుంది కానీ గ్లామర్ క్వీన్ అనే ముద్ర రావాలంటే ఎంతసేపు.. ఒక్క సినిమా చేసినంత సేపంతే.

ఇన్నాళ్లూ హోమ్లీ బ్యూటీ నీడలోనే ఉండిపోయిన అనుపమ.. టిల్లు స్క్వేర్‌తో డోస్ పెంచేసారు.. ఒక్క సినిమాతోనే తన ఇమేజ్ రూపు రేఖలు మార్చేసుకున్నారు. ఇప్పుడు అనుపమ అంటే కేరాఫ్ గ్లామర్ అన్నమాట.

కెరీర్ మొదట్నుంచి పక్కింటి అమ్మాయి పాత్రలే చేసిన అనుపమ పరమేశ్వరన్.. రౌడీ బాయ్స్ నుంచి రూట్ మార్చారు. టిల్లు స్క్వేర్‌తో గేర్ మార్చారు. గ్లామర్ డోస్ పెంచాలని ఫిక్సయ్యాక.. అస్సలు తగ్గేదే లే అంటున్నారు ఈ బ్యూటీ.

సిద్ధూ జొన్నలగడ్డతో లిప్ లాక్స్, ఇంటిమేట్ సీన్స్ కూడా చేసారు అనుపమ. కానీ ఆ తర్వాత ఈ భామకు ఆఫర్స్ అయితే పెద్దగా రావట్లేదు. అనుపమ కెరీర్ ఇకపై ఎలాంటి టర్న్ తీసుకోబోతుందనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు.

టిల్లు స్క్వేర్ తర్వాత పరదా అనే సినిమా సైన్ చేసారు ఈ బ్యూటీ. స్టార్స్ నుంచి అయితే ఎలాంటి పిలుపు రాలేదు.. మీడియం రేంజ్ నుంచి కూడా ఆఫర్స్ లేవు. దర్శక నిర్మాతల మౌనం అనుపమ పరమేశ్వరన్ కెరీర్‌ను ఎటువైపు తీసుకెళ్తుందనేది చూడాలిక.





























