
కోలీవుడ్‌లో టాప్ గేర్‌లో ట్రావెల్ చేస్తున్న విజయ్ అండ్ అజిత్.. కెరీర్‌కి ఫుల్ స్టాప్ పెట్టేస్తారా? జస్ట్ బ్రేక్ ఇస్తున్నారా? వాళ్ల మనసుల్లో ఏం ఉన్నప్పటికీ, ఆ గ్యాప్‌ని ఫిల్ చేసే హీరోలు ఎవరనే చర్చ మాత్రం స్పీడందుకుంది.

తాజాగా ఈ చిత్ర షూట్ పూర్తైంది. ఇందులో సూర్య లుక్ పుష్పలో అల్లు అర్జున్‌ను గుర్తు చేస్తుంది. దీని తర్వాత కమెడియన్ కమ్ డైరెక్టర్ RJ బాలాజీతో ఓ సినిమా చేయబోతున్నారు సూర్య. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది. ఓ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుండగానే.. మరో సినిమా పూర్తి చేస్తున్నారు సూర్య.

దీంతో కంగువాకు పూర్తి స్థాయిలో థియేటర్లు దక్కకపోవచ్చన్న అంచనా వేస్తున్నారు. మరి ఈ ఇష్యూని కంగువ టీమ్ ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి.

ఫస్ట్ నుంచీ మోటార్ రేసింగ్ అంటే తల అజిత్‌కి ప్రాణం. తన ప్యాషన్ కోసం సినిమాలకు కొన్నాళ్లు కామా పెట్టాలనుకుంటున్నారట అజిత్. ఇప్పుడు చేతిలో ఉన్న రెండు చిత్రాల తర్వాత అజిత్ ఇంకే సినిమాలూ చేయరా..?

అదే జరిగితే విజయ్ అండ్ అజిత్ ప్లేస్‌లను రీప్లేస్ చేసేది ఎవరంటే సూర్య పేరే ఎక్కువగా వినిపిస్తోంది. సినిమాల కోసం విపరీతంగా కష్టపడతారనే పేరుంది సూర్యకి. ఆయన పడే కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఇంకా అందుకోలేదనే టాక్ కూడా ఉంది.

ఓ రకంగా విజయ్, అజిత్‌లాంటివారు అదర్ మార్కెట్స్ మీద దృష్టి పెట్టకముందు నుంచే సూర్య అండ్ విక్రమ్ ఆ పని మీదే ఉండేవారు. కెరీర్ ప్రారంభంలో సూర్య అండ్ విక్రమ్ కలిసి సినిమాలు చేసి మెప్పించారు.

ఇప్పుడు అదర్ మార్కెట్స్ లోనూ హవా చూపిస్తున్నారు. సో విజయ్ అండ్ అజిత్ ప్లేస్‌ని ఇమీడియేట్‌గా కబ్జా చేసే అవకాశం సూర్య అండ్ విక్రమ్‌కి ఉందన్నమాట.