Surya In Jai Bheem: ఆకట్టుకుంటున్న జైభీమ్.. లాయర్ పాత్రలో సూర్య యాక్టింగ్ పీక్స్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..
తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన లెటేస్ట్ చిత్రం జైభీమ్. డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్లో హిట్ టాక్తో దూసుకుపోతుంది. ఇందులో సూర్య లాయర్ పాత్రలో అదరగొట్టగా..
తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన లెటేస్ట్ చిత్రం జైభీమ్.
1 / 13
తాజాగా జైభీమ్ చిత్రం చైనాలోనూ విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. చైనాకు చెందిన ప్రముఖ మీడియా సమీక్ష ప్లాట్‌ఫామ్ అయిన డౌబన్‌లో 8.7 రేటింగ్‌ను దక్కించుకొని చైనీయులను సైతం విపరీతంగా ఆకట్టుకుంది.
2 / 13
ఇందులో సూర్య లాయర్ పాత్రలో అదరగొట్టగా.. సినతల్లి పాత్రలో లిజోమోల్ జోస్ జీవించింది. ఈ సినిమాలోని ప్రతి ఒక్కరి నటనకు ప్రేక్షకులు ఫిదా అవ్వగా..
3 / 13
సినీ, రాజకీయ ప్రముఖులు జైభీమ్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
4 / 13
ఈ సినిమాను జస్టిస్ చంద్రు జీవితం ఆధారంగా తెరెక్కించిన ఈ మూవీ ఎక్కువగానే కోర్టులోనే సాగుతుంది.
5 / 13
ఇక ఈ సినిమా డిజిటల్ ప్లాట్ ఫాంలో సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతుంది.
6 / 13
తాజాగా ఈ సినిమా కోర్టుకు సీన్లకు సంబంధించిన మేకింగ్ వీడియోను చిత్రయూనిట్ విడుదల చేసింది.
7 / 13
ఈ మూవీ కోసం మద్రాసు హైకోర్టును రీక్రియేట్ చేసింది చిత్రయూనిట్.
8 / 13
కేవలం 25 రోజుల్లో తీర్చిదిద్దిన సెట్ చూసి, గత కొన్నేళ్లుగా మాద్రాసు హైకోర్టులో పనిచేస్తున్న హైకోర్టు సిబ్బంది.. న్యాయవాదులు సైతం ఆశ్చర్యపోయారు.
9 / 13
1995 నాటి కోర్టు వాతావరణాన్ని తెరపై చూపించడానికి ప్రొడక్షన్ డిజైనర్ కె.కదిర్, సినిమాట్రోగ్రాఫర్ ఎస్.ఆర్.కదిర్ లు ఎంతో కృషి చేశారట.
10 / 13
అంతేకాకుండా.. డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ తన ఊహలకు ప్రాణం పోశారు.
11 / 13
సెట్ వేసే సమయంలో జస్టిస్ చంద్రు కూడా సెట్ దగ్గరకు వచ్చి సలహాలు ఇవ్వడం గమనార్హం.
12 / 13
మొత్తానికి సూర్య.. లిజోమోల్ కీలక పాత్రలలో నటించిన జైభీమ్ సినిమా హిట్ టాక్తో విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ దూసుకుపోతుంది.