
ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలో విడాకులు అనేది చాలా కామన్ అయిపోయింది. ఏ మాత్రం అభిప్రాయాలు కలవకపోయినా.. కలిసుండటం వృధా కదా అనుకుంటున్నారు. తాజాగా మరో జంట కూడా విడిపోయింది. 15 ఏళ్ళ తమ వివాహ బంధానికి ఓ స్టార్ హీరో ముగింపు పలికారు. అసలేమైంది..? ఎందుకు వాళ్లు విడిపోయారు..? ఎవరా జంట..? ఈ స్టోరీలో చూసేద్దాం..

జయం రవి.. సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న పేరు ఇది.. కారణం ఆయన విడాకులు. 15 ఏళ్ల తమ పెళ్లి బంధానికి విడాకులతో వీడ్కోలు పలికారు జయం రవి. ఇదే విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.

పరస్పర అంగీకారంతోనే భార్య ఆర్తితో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. కొన్ని రోజులుగా వినిపిస్తున్న వార్తల్నే నిజం చేసారు జయం రవి. 2009లో జయం రవి, ఆర్తి పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఆరవ్, అయాన్ అనే ఇద్దరు కుమారులున్నారు.

మా ఇద్దరి భవిష్యత్ కోసమే కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం.. మా వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని మీ అందరినీ కోరుతున్నాను.. ఈ విషయంపై పుకార్లు, ఆరోపణలు మానేయాలని మనవి చేస్తున్నానంటూ ట్విట్టర్‌లో లెటర్ పోస్ట్ చేసారు జయం రవి.

మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లున్న జంట విడిపోవడంతో.. జయం రవి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఎన్నో ఆలోచనలు, చర్చల తర్వాత భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు తెలిపారు రవి. ఈ మధ్యే ధనుష్, ఐశ్వర్యతో పాటు.. 2024, మే 13న ప్రముఖ సంగీత దర్శకుడు జివి ప్రకాశ్ కుమార్ సైతం తన భార్య సైంధవితో విడాకులు ప్రకటించారు. తాజాగా జయం రవి ఈ లిస్టులో చేరిపోయారు.