- Telugu News Photo Gallery Cinema photos Hero Dulquer Salmaan Focus on other languages industries his next movies Telugu Heroes Photos
Dulquer Salmaan: మలయాళం హీరో కాస్త ఇప్పుడు తెలుగు హీరో అయిపోయారు.. ఇకపై ఇలానే: దుల్కర్.
దుల్కర్ సల్మాన్‌కు సొంత ఇండస్ట్రీ అంటే ఇష్టం లేదా.. మలయాళం నుంచి బయటికి రావాలని చూస్తున్నారా..? అదేంటి పుసుక్కున అంత మాట అనేసారు అనుకుంటున్నారు కదా..? ఊరికే అనడానికి మాకేమైనా సరాదానా చెప్పండి..? ఆయన చేస్తున్న పనులు అలాగే ఉన్నాయి మరి. అసలు దుల్కర్ సల్మాన్ ప్లానింగ్ ఏంటి..? అసలు కంటే కొసరు ముద్దు అంటుంటారు పెద్దలు.. ఇప్పుడు దుల్కర్ సల్మాన్‌ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది.
Updated on: Jun 28, 2024 | 8:47 PM

లక్కీ భాస్కర్ సెట్స్‌పై ఉండగానే.. మరో తెలుగు సినిమాకు దుల్కర్ ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. సేనాపతి, దయా లాంటి ఓటిటి కంటెంట్‌తో ఆకట్టుకున్న పవన్ సాధినేనితో దుల్కర్ సల్మాన్ ప్రాజెక్ట్ ఓకే అయినట్లు ప్రచారం జరుగుతుంది.

అసలు దుల్కర్ సల్మాన్ ప్లానింగ్ ఏంటి..? అసలు కంటే కొసరు ముద్దు అంటుంటారు పెద్దలు.. ఇప్పుడు దుల్కర్ సల్మాన్‌ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. సొంత ఇండస్ట్రీని వదిలేసి.. పక్క ఇండస్ట్రీలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు ఈ హీరో.

కెరీర్ మొదట్లో వరసగా మలయాళంలోనే నటించిన ఈయన.. కొన్నేళ్లుగా తెలుగు ఇండస్ట్రీపై స్పెషల్ ఫోకస్ చేసారు. మహానటి, సీతా రామంతో ఇప్పటికే దుల్కర్ తెలుగు హీరో అయిపోయారు.

మొత్తానికి సొంత ఇండస్ట్రీ కంటే తెలుగుకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు మలయాళ మెగాస్టార్ వారసుడు.

దాంతో కరోనా తర్వాత ఎక్కువగా తెలుగుపై ఫోకస్ చేసారీయన. ఈ క్రమంలోనే ప్రస్తుతం వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న లక్కీ భాస్కర్‌లో హీరోగా నటిస్తూనే.. మరో రెండు సినిమాల్లో కీలక పాత్రలకు ఓకే చెప్పారు.

ప్రభాస్ కల్కిలో అతిథి పాత్రలో నటించారు దుల్కర్ సల్మాన్. అలాగే తేజ సజ్జా, కార్తిక్ ఘట్టమనేని కాంబినేషన్‌లో వస్తున్న మిరాయ్‌లో దుల్కర్ సపోర్టింగ్ రోల్ చేస్తున్నారని తెలుస్తుంది.

హిందీలోనూ వెబ్ సిరీస్‌లతో పాటు సినిమాలకు ఓకే చెప్తున్నారు ఈ హీరో. మొత్తానికి అన్ని భాషల్లో నటిస్తూ అసలు సిసలైన పాన్ ఇండియన్ స్టార్ బిరుదు కోసం చూస్తున్నారు దుల్కర్ సల్మాన్.




