
బిగ్ బాస్ గ్రాండ్ లాంఛ్ కు సర్వం సిద్ధమైంది. ఆదివారం (సెప్టెంబర్ 07) సాయంత్రం 7 గంటలకు ఈ లాంచింగ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

బిగ్ బాస్ గ్రాండ్ లాంఛ్ కు సంబంధించి కొద్ది సేపటి క్రితమే ఒక ప్రోమోను వదిలారు మేకర్స్. ఇందులో సీజన్ 9 సంబంధించిన హౌస్ ఫొటోస్ కొన్ని బయటకు వచ్చాయి.

లాంఛింగ్ ఎపిసోడ్ కోసం బిగ్ బాస్ హౌస్ లను బటర్ ఫ్లై థీమ్ తో డెకరేట్ చేశారు. ఇక మొదటి వారంలో ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ థీమ్ తో షో కొనసాగనుంది.

ఈసారి బిగ్ బాస్ హౌస్ లో మొత్తం మూడు పెద్ద గదులు ఉన్నాయి. అందులో లగ్జరీ రూమ్ కామనర్స్ కు, సెలబ్రిటీలకు కంటైనర్ రూమ్ కేటాయించారు.

ఇక కెప్టెన్ కోసం ప్రైవేట్ గా స్పెషల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం బిగ్ బాస్ 9 సీజన్ హౌస్ ఫొటోస్ నెట్టింట బాగా వైరలవుతున్నాయి.

కాగా మొదట 15 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇందులో 9 గురు సెలబ్రిటీలు కాగా ఆరుగురు కామనర్స్ క్యాటగిరీ. ఇక దీపావళికి వైల్డ్ కార్ట్ ఎంట్రీస్ కూడా ఉండనున్నట్లు సమాచారం.