Prabhas: ఆ దర్శకుడికి సెకండ్ ఛాన్స్ ఇస్తున్న డార్లింగ్‌.. రిస్క్‌కు రెడీ అంటున్న ప్రభాస్

Edited By: Phani CH

Updated on: Apr 08, 2025 | 6:37 PM

ప్రభాస్ కెరీర్‌లో దర్శకులను రిపీట్ చేసిన సందర్భాలు చాలా తక్కువ. పాన్ ఇండియా హీరో అయ్యాక ఒక సినిమా చేసిన దర్శకుడితో మరో సినిమా ఇంత వరకు చేయలేదు. ఈ టైమ్‌లో ఓ దర్శకుడికి సెకండ్ ఛాన్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు డార్లింగ్‌. ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న సినిమా దర్శకుడితో మరో మూవీ చేయబోతున్నారు. అది కూడా ఆ దర్శకుడికి అస్సలు పరిచయం లేని జానర్‌లో కావటం మరింత ఆసక్తికరంగా మారింది.

1 / 5
ప్రజెంట్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమాలో నటిస్తున్నారు ప్రభాస్‌. రెండో ప్రపంచ యుద్దం కాలం నాటి ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

2 / 5
ఈ సినిమా షూటింగ్‌ టైమ్‌లోనే హనుకి మరో బంపర్‌ ఆఫర్ ఇచ్చారట డార్లింగ్‌. ఫౌజీ కోసం షూట్ చేసిన ఓ యాక్షన్‌ ఎపిసోడ్ చూసి ఇంప్రెస్‌ అయిన ప్రభాస్‌, హను దర్శకత్వంలో ఓ పూర్తిస్థాయి యాక్షన్ మూవీ చేద్దామని చెప్పారట.

3 / 5
కథ రెడీ చేస్తే వెంటనే ఆ సినిమాను పట్టాలెక్కిద్దామని చెప్పటంతో ఫౌజీ షూటింగ్‌తో పాటు నెక్ట్స్ మూవీకి కథను సిద్ధం చేసే ఆలోచనలో ఉన్నారు హను. హార్ట్ టచింగ్‌ లవ్ స్టోరీస్‌ తెరకెక్కించే హను పూర్తి యాక్షన్ సినిమాను ఎలా డీల్ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

4 / 5

గతంలో స్పై జానర్‌లో లై సినిమాను ట్రై చేశారు హను. ఆ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చినా... కమర్షియల్‌గా వర్కవుట్ కాలేదు. అందుకే తరువాత మళ్లీ యాక్షన్ జానర్‌ను టచ్ చేయలేదు హను.

5 / 5
ఇప్పుడు ప్రభాస్‌ స్వయంగా కోరటంతో మరోసారి ఆ రిస్క్ చేసేందుకు రెడీ అవుతున్నారు హను రాఘవపూడి. మరి ప్రభాస్‌ ఇమేజ్‌కు తగ్గ యాక్షన్ కథను హను సిద్ధం చేస్తారా..? చేస్తే ఆ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుంది? ఈ విషయాల్లో క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.