
చిరంజీవి, తమన్నా జంటగా నటించిన భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. గోపీచంద్ మలినేని సినిమా ఇండస్ట్రీకి వచ్చి 22 ఏళ్లు పూర్తయింది. గోపీచంద్ మలినేని సినిమా ఇండస్ట్రీకి వచ్చి 22 ఏళ్లు పూర్తయింది. అల్లు అర్జున్, రష్మిక మందన్నజంటగా నటిస్తున్న సినిమా పుష్ప ది రూల్.కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న సినిమా రూల్స్ రంజన్.గాంఢీవధారి అర్జున సినిమాలో తన పోర్షన్‌కి డబ్బింగ్ షురూ చేశారు హీరో వరుణ్ తేజ్.

చిరంజీవి, తమన్నా జంటగా నటించిన భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. తాను సెట్లోకి వస్తున్నానంటే మెహర్ రమేష్ వణికిపోయేవాడని, శీతాకాలంలోనూ అతనికి చెమటలు పట్టేవని అన్నారు చిరంజీవి. వేదాళం కథ తీసుకుని మనకు తగ్గట్టు మార్పులు చేసి తెరకెక్కించినట్టు తెలిపారు.

గోపీచంద్ మలినేని సినిమా ఇండస్ట్రీకి వచ్చి 22 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆయన రవితేజను ప్రస్తావిస్తూ ఓ ట్వీట్ పెట్టారు. రవితేజ వల్లనే తన కల సాకారమైందని చెప్పారు. తన మీద ఉన్న నమ్మకంతో డాన్ శీను సినిమా చేశారని చెప్పారు రవితేజ. ఈ ఇద్దరి కాంబినేషన్లో త్వరలోనే ఓ సినిమా మొదలు కానుంది.

అల్లు అర్జున్, రష్మిక మందన్నజంటగా నటిస్తున్న సినిమా పుష్ప ది రూల్. ప్యాన్ ఇండియా రేంజ్‌లో సూపర్ సక్సెస్ అయిన పుష్ప సినిమాకు సీక్వెల్ ఇది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. డైరక్టర్ సుకుమార్ టాకీ పోర్షన్ తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్‌తో పాటు ప్రధాన పాత్రధారులు షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న సినిమా రూల్స్ రంజన్. ఈ సినిమా నుంచి ఎందుకురా బాబూ అనే పాటను విడుదల చేశారు మేకర్స్. లవ్ ఫెయిల్యూర్ నేపథ్యంలో వచ్చే పాట అని అన్నారు కిరణ్ అబ్బవరం. ట్యూన్ కొత్తగా ఉందని, తప్పకుండా అందరికీ నచ్చుతుందని చెప్పారు మేకర్స్. వచ్చే నెల్లో విడుదల కానుంది రూల్స్ రంజన్.

గాంఢీవధారి అర్జున సినిమాలో తన పోర్షన్‌కి డబ్బింగ్ షురూ చేశారు హీరో వరుణ్ తేజ్. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అలియాస్ అర్జున్ వర్మ డబ్బింగ్ మొదలుపెట్టేశారు. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటిస్తాం. ఈ నెల 25న సినిమాను విడుదల చేస్తామని చెప్పారు మేకర్స్. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది.