
Jailer: రజనీకాంత్ హీరోగా నటించిన సినిమా జైలర్. 'బాగా దూరం పోయాను. పూర్తి చేశాక కానీ తిరిగిరాను' అని ట్రైలర్‌లో రజనీ చెప్పిన డైలాగ్ వైరల్ అవుతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ నెల 10న విడుదల కానుంది జైలర్.

Adah Sharma: నటి ఆదాశర్మ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఫుడ్ ఎలర్జీ, డయేరియాతో ఆసుపత్రిలో చేరారు. ఆమె నటించిన 'కమాండో' ప్రమోషన్లకు ముందు ఫుడ్ ఎలర్జీ అయింది. 'కమాండో'లో ఆమె భావనారెడ్డిగా కనిపిస్తారు. 'ది కేరళ స్టోరీ' తర్వాత ఆమె నటించిన ప్రాజెక్ట్ ఇదే.

Charuhasan: కమల్‌హాసన్ సోదరుడు చారుహాసన్‌కి ఇప్పుడు 93 సంవత్సరాలు. ఈ వయసులో ఆయన సిల్వర్ స్క్రీన్ మీద డాన్‌గా కనిపించబోతున్నారు. 'హర' అనే సినిమాలో ఆయన ఈ కేరక్టర్ చేస్తున్నారు. విద్యార్థి దశలోనే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి విషయాలను చెప్పే సినిమా ఇది. ఇందులో చారుహాసన్ సామాజిక బాధ్యత కలిగిన డాన్‌గా కనిపిస్తారు.

Naga Chaitanya: నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. శ్రీకాకుళం, గుజరాత్ నేపథ్యంలో సాగే కథ ఇది. మత్య్స కారుల జీవితాలను ఆవిష్కరిస్తుంది. ఈ సినిమా కోసం మూడు రోజుల పాటు వైజాగ్‌లో ఉంటారు నాగచైతన్య. అక్కడ మత్య్సకారులను కలిసి మాట్లాడుతారు.

Shraddha Kapoor: నటి శ్రద్ధాకపూర్‌కి ఓ అభిమాని ప్రపోజ్ చేశారు. ముంబై ఎయిర్‌పోర్టులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఎక్కడికెళ్లినా అభిమానులు ఏదో రకంగా మనసులోని ప్రేమను వ్యక్తం చేస్తూనే ఉంటారని, అంత మంది ప్రేమను పొందడం అదృష్టమని అన్నారు సాహో బ్యూటీ.