
ట్రిపులార్ సినిమా రిలీజ్ అయి రెండేళ్లు దాటింది. ఇంతవరకు తారక్ నెక్ట్స్ మూవీ ఆడియన్స్ ముందుకు రాలేదు. కొరటాల దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న జూనియర్, సెప్టెంబర్ 27న ఆడియన్స్ ముందుకు రానుంది.

ఈ సినిమా తరువాత జూనియర్ ఇమేజ్ నెక్ట్స్ లెవల్‌కు చేరుతుందని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు ఫ్యాన్స్. ట్రిపులార్‌తో గ్లోబల్ స్టార్‌గా ఎమర్జ్ అయిన జూనియర్ ఎన్టీఆర్, ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నారు.

పాన్ ఇండియా రేంజ్‌లో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ షూటింగ్ దాదాపుగా ఫైనల్ స్టేజ్‌కు వచ్చింది. సెప్టెంబర్ 27న రిలీజ్ చేసేందుకు డేట్ లాక్ చేసింది టీమ్.

ఆ మధ్య ఓ సినిమా ఫంక్షన్‌లో మాట్లాడిన తారక్, దేవర అప్‌డేట్ ఇచ్చారు. సినిమా కథ ఎలా ఉండబోతుందన్న క్లారిటీ కూడా ఇచ్చారు. అంతేకాదు దేవర సినిమా.. అభిమానులు కాలర్ ఎగరేసేలా ఉంటుందని కాన్పిడెంట్‌గా చెప్పారు జూనియర్.

దేవర విసయంలో ఫస్ట్ నుంచి చాలా నమ్మకంగా ఉన్నారు తారక్. ట్రిపులార్ రిలీజ్ తరువాత స్క్రిప్ట్ వర్క్ మీదే ఎక్కువ టైమ్ కేటాయించారు. అంతా ఓకే అనుకున్న తరువాతే సినిమాను సెట్స్ మీదకు తీసుకు వచ్చారు.

పక్కా ప్లానింగ్‌తో జెట్ స్పీడుతో షూటింగ్ పనులు కానిచ్చేస్తున్నారు. అందుకే టాలీవుడ్ నుంచి రాబోయే నెక్ట్స్ సెన్సేషన్ ఈ సినిమాను అని గట్టిగా నమ్ముతున్నారు ఫ్యాన్స్.

తారక్‌కు జోడిగా జాన్వీ కపూర్ టాలీవుడ్‌కు పరిచయం అవుతుండటం, విలన్‌గా సైఫ్ అలీఖాన్ నటిస్తుండటం కూడా దేవరకు కలిసొస్తుందన్న నమ్మకంతో ఉంది చిత్రయూనిట్.