
నేను నా రీజినల్ ఆడియన్స్ కి వడ్డించే దమ్ మసాలా బిర్యానీ ఇదే.. నెక్స్ట్ కెరీర్ డ్రైవ్ ఎలా ఉంటుందో ఇప్పుడైతే చెప్పలేనని ముందే ఓపెన్ అయ్యారు సూపర్‌స్టార్ మహేష్. అలా ఎందుకు అనుకుంటారు సార్.. ఓ వైపు మీ రేంజ్ సినిమాలు చేస్తూనే, మరోవైపు రీజినల్ సినిమాల మీద కూడా ఓ లుక్కేయండి అని రిక్వెస్టులు అందుతున్నాయి మహేష్‌కి.

మన పుష్పరాజ్ పరిస్థితి కూడా ఇదే. ఎప్పటికైనా మంచి మ్యూజిక్ ఓరియంటెడ్ లవ్‌స్టోరీ చేయాలని ఉందని ఈ మధ్యనే స్టేట్‌మెంట్ ఇచ్చారు. మరి పెరిగిన ఇమేజ్.. క్యూట్ లవ్ స్టోరీకి స్కోప్ ఇస్తుందా? మీరు మనసు పెట్టండి గురూ అన్నీ అవే అవుతాయని అంటోంది అల్లు ఆర్మీ. రెబల్ సైన్యం నుంచి కూడా ప్రభాస్‌కి ఇలాంటి రిక్వెస్టులే అందుతున్నాయి.

ప్రతిదీ ప్యాన్ ఇండియా సినిమానే కావాలని కూర్చోవద్దు. అలా చేస్తే కొన్ని స్ట్రాంగ్ స్టోరీలను మిస్ అయిపోతారేమో.. ఒకట్రెండు హ్యూజ్ సబ్జెక్టులు చేసినా, మధ్య మధ్యలో మనవాళ్లకు కనెక్ట్ అయ్యే సినిమాలు చేయండి.

అప్పుడే మన గ్రౌండ్ మీద పట్టు ఉంటుందనే సలహాలిస్తున్నారు డార్లింగ్‌కి. ఎగ్జాంపుల్‌గా రీసెంట్ బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాను చూపిస్తున్నారు.

ప్యాన్ ఇండియా చిత్రాల సక్సెస్ రేట్లు ఎలా ఉన్నా.. మన వాళ్లను ఉద్దేశించి తీసిన సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్స్ కావట్లేదు. పైగా సినిమా బావుంటే, ఆటోమేటిగ్గా పొరుగు వారు అనువాదం చేసుకుంటారు. అందుకే, కొంచెం థింక్ లోకలీ.. యాక్ట్ గ్లోబలీ అనే కాన్సెప్టు మీద దృష్టి పెట్టమంటున్నారు క్రిటిక్స్.