- Telugu News Photo Gallery Cinema photos Eesha Rebba latest stunning photos with saree goes viral in internet
Eesha Rebba: ఆ చంద్రుడైనా అసూయ పడడ.. ఈ భామ వంటి రూపం తనకి లేదని..
తన అందం, అభినయంతో కుర్రకారు మనసు దోచేయడం ఈమె ప్రత్యేకత. తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా, సహాయనటిగా ఎన్నో సినిమాల్లో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తెలుగమ్మాయిగా తనకంటూ ఇండస్ట్రీలో ఓ మంచి గుర్తింపును సంపాదించుకుంది ఈ వయ్యారి. ఆమె ఎవరో కాదు.. ఓరుగల్లు పిల్ల ఈషా రెబ్బ. ఈమె కెరీర్, ఎడ్యుకేషన్, పుట్టినరోజు వంటి కొన్ని విషయాలు తెలుసుకుందాం..
Updated on: Apr 10, 2024 | 12:50 PM

19 ఏప్రిల్ 1990 తెలంగాణలోని చారిత్రాత్మక నగరం వరంగల్ లో ఓ తెలుగు హిందూ కుటుంబంలో జన్మించింది అందాల భామ ఈషా రెబ్బ. ఈమె పెరిగింది మాత్రం హైదరాబాద్ నగరంలోనే.

ఈ వయ్యారి హైదరాబాద్ లోని వరంగల్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో పాఠశాల విద్యను అభ్యసించింది. ఓ ప్రముఖ కళాశాల నుంచి మాస్టర్స్ అఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA)లో డిగ్రీ పట్టా పొందింది ఈ ముద్దుగుమ్మ.

2012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో తెరంగేట్రం చేసింది. అయితే హీరోయిన్ గా కెరీర్ మొదలైంది మాత్రం ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శత్వంలో వచ్చిన అంతక ముందు సినిమాతో.. ఇందులో సుమంత్ అశ్విన్ హీరో.

తర్వాత రొమాంటిక్-కామెడీ చిత్రం అమీ తుమీలో కథానాయకిగా మెప్పించింది. ఇందులో ఆమె నటనకు విస్తృత స్పందన లభించింది. మూడు అవార్డులు కూడా లభించాయి. మాయా మాల్, దర్శకుడు, ఆ, బ్రాండ్ బాబు వంటి చిత్రాల్లో నటించింది.

తర్వాత ఎన్టీఆర్ హీరోగా వచ్చిన అరవింద సామెత వీర రాఘవ నుంచి సెకండ్ హీరోయిన్ గా మారింది ఈ వయ్యారి. తర్వాత కొన్ని చిత్రం కూడా సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. 2023 లో మామా మశ్చీంద్రలో మరోసారి కథానాయకిగా కనిపించింది. 3 రోజెస్, పిట్టా కథలు, మాయ బజార్ ఫర్ సేల్, దయ వంటి వెబ్ సిరీస్ ల్లో కూడా నటించింది.




