
అందాల ముద్దుగుమ్మ , తెలుగు అమ్మాయి ఈషారెబ్బా గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ చిన్నది చిన్న సినిమాల్లో నటిస్తూ, తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా, తన అంద చందాలతో ప్రతి ఒక్కరి మనసు దోచేసింది.

అంతక ముందు ఆ తర్వాత అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన బ్యూటీ ఈషా రెబ్బా. ఈ అమ్మడు ఈ సినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. తర్వాత ఈ చిన్నదానికి వరసగా అవకాశాలు రావడంతో తెలుగులో వరసగా సినిమాలు చేసింది.

అమితుమీ, విస్మయం, బ్రాండ్ బాబు, అరవింద సమేత, వీర రాఘవ, ఇలా చాలా సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది, కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది. అయితే ఈ అమ్మడు చాలా సినిమాల్లో నటించినప్పటికీ, ఆశించిన స్థాయిలో ఫేమ్ సంపాదించుకోలేకపోయింది.

చాలా వరకు చిన్న చిన్న సినిమాల్లోనే ఛాన్స్‌లు అందుకుంది. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకోలేకపోయింది. ఇక తెలుగులో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు తగ్గడంతో, తమిళ్, మళయాలంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై కూడా ఈ అమ్మడు సందడి చేసింది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ అందాల ముద్దుగుమ్మ, తాజాగా ఆరెంజ్ కలర్ చీరలో తన అందంతో అందరినీ మాయ చేసింది. ఇక ఈ ఫొటోస్ చూసిన వారందరూ, ఈషా అందాన్ని చూస్తే ఈర్ష్య కలగడం ఖాయం అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.