Film Updates: ఇండస్ట్రీపై ఎన్నికల ఎఫెక్ట్.. ఆ హీరోలు మాత్రమే షూటింగ్స్ లో..

| Edited By: Prudvi Battula

Mar 14, 2024 | 9:17 AM

కళ్లు మూసి తెరిచేలోపే మరో వారం గడిచిపోయింది..  షూటింగ్ అప్‌డేట్స్ వచ్చేసాయి. ఎన్నికల కారణంగా ఇండస్ట్రీలో చాలా సినిమాల షూటింగ్స్ జరగట్లేదు.. ముగ్గురు నలుగురు స్టార్స్ మాత్రమే సెట్స్‌లో ఉన్నారు. మరి వాళ్లెవరు.. ఏయే హీరోల షూటింగ్స్ ఎక్కడ జరుగుతున్నాయి..? ఎవరు బ్రేక్‌లో ఉన్నారో చూద్దాం.. ఇండస్ట్రీలో ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ఎఫెక్ట్ బాగా కనిపిస్తుంది. ఇప్పుడు చాలా సినిమాల షూటింగ్స్ ప్రస్తుతానికి హోల్డ్‌లో ఉన్నాయి. 

1 / 5
ఉన్న వాళ్లలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సోసియో ఫాంటసీ చిత్రం విశ్వంభర షూటింగ్ కొల్లూరులోని గుంటూరు కారం సెట్‌లో జరుగుతుంది. ఇందులో త్రిష కృష్ణన్ హీరోయిన్ నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. 

2 / 5
ప్రభాస్  కల్కి కోసం ఇటలీ వెళ్లారు. అక్కడే డార్లింగ్, దిశా పటాని మధ్య ఓ మాస్ పాట చిత్రీకరిస్తున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. అలాగే మార్చి 13 నుంచి మారుతీ దర్శకత్వంలో వస్తున్న రాజా సాబ్ కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో మొదలు కానుంది.

3 / 5
అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ RFC నుంచి వైజాగ్ పోర్టుకు షిఫ్ట్ అయింది. అక్కడ బన్నీకి ఘన స్వాగతం పలికారు అభిమానులు. ఈ సినిమా స్వతంత్ర దినోత్సవం కానుకగా ఆగస్టు 15న పాన్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

4 / 5
ఇక బాలయ్య ఉన్నా లేకపోయినా బాబీ మాత్రం NBK 109 షూటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం RFCలో ఈ చిత్ర షూట్ జరుగుతుంది. నితిన్, వెంకీ కుడుముల రాబిన్ హుడ్ షూటింగ్ హైదరాబాద్ నగరంలోని నాంపల్లిలో శరవేగంగా జరుగుతుంది.

5 / 5
నాగ చైతన్య తండేల్ చిత్ర షూటింగ్ BHEL రామచంద్రాపురంలో జరుగుతుంది. అక్కడే పాకిస్తాన్ జైలు సెట్ వేసి కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు చందూ మొండేటి. అలాగే శర్వానంద్, సామజవరగమనా ఫేం రామ్ అబ్బరాజు కాంబోలో వస్తున్న సినిమా షూటింగ్ తారమతి బరదారిలో మొదలైంది. దీంతో పాటు మనమే సినిమా కూడా చేస్తున్నారు శర్వా.