Mamitha Baiju : ఆ స్టార్ హీరో సినిమా అంటే చాలా ఇష్టం.. చాలా బాగుంటుంది.. డ్యూడ్ మూవీ హీరోయిన్ మమితా..

Updated on: Oct 18, 2025 | 8:40 PM

ప్రేమలు సినిమాతో తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది కేరళ బ్యూటీ మమితా బైజు. ఒక్క సినిమాతోనే తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ బ్యూటీ. ఇప్పుడు డ్యూడ్ సినిమాతో మరోసారి తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది. కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన ఈ చిత్రాన్ని తమిళంతోపాటు తెలుగులోనూ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

1 / 5
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకుంటున్న సినిమాల్లో డ్యూడ్ ఒకటి. లవ్ టుడే, డ్రాగన్ చిత్రాలతో హిట్స్ అందుకున్న హీరో ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు డ్యూడ్ సినిమాతో మరోసారి తెలుగు అడియన్స్ ముందుకు వచ్చారు. అక్టోబర్ 17న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది.

2 / 5
ఇందులో ప్రదీప్ సరసన మమితా బైజు హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ప్రేమలు సినిమాతో తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది మమితా. మలయాళంలో చాలా కాలంగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కథానాయికగా అనేక సినిమాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ.

3 / 5
కానీ ప్రేమలు సినిమాతో ఈ బ్యూటీ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రేమలు సినిమా తర్వాత ఆమెకు తెలుగులో సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది. ఈ మూవీ తర్వాత ఇప్పుడు డ్యూడ్ సినిమాతో మరోసారి తెలుగు అడియన్స్ ముందుకు వచ్చిన ఈ బ్యూటీ.. ఇటీవల తనకు ఇష్టమైన హీరో గురించి చెప్పుకొచ్చింది.

4 / 5
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాలు చూసేవారా అని అడగ్గా మమితా బైజు మాట్లాడుతూ.. రామ్ చరణ్ మగధీర సినిమా అంటే చాలా ఇష్టమని.. మలయాళంలో ఈ మూవీ ధీర పేరుతో వచ్చిందని.. ఆ సినిమా చాలా బాగుంటుందని చెప్పుకొచ్చింది.

5 / 5
అలాగే తాను స్కూల్ టైంలో ఉన్నప్పుడు ఆర్య, ఆర్య 2 చిత్రాలు చూశానని.. ఆ రెండు సినిమాలు చాలా బాగుంటాయని చెప్పుకొచ్చింది. ఇక రీసెంట్ టైమ్స్ మూవీ గురించి చెప్పలేదు. దీంతో అల్లు అర్జున్, చరణ్ ఫ్యాన్స్ మమిత చేసిన కామెంట్స్ తెగ షేర్ చేస్తున్నారు.