
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, క్రియేటివ్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ దృశ్యం. అనుకోకుండా చిక్కుల్లో పడ్డ ఓ కుటుంబం... ఆ సమస్య నుంచి బయటపడేందుకు ఏం చేసింది... అనే పాయింట్‌ను థ్రిల్లింగ్‌గా రూపొందించి సూపర్ హిట్ సాధించారు మేకర్స్. దృశ్యం మాలీవుడ్‌లో సంచలన విజయం సాధించటంతో తరువాత ఇతర భాషల్లో రీమేక్ చేశారు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ ఇలా రీమేక్ అయిన అన్ని భాషల్లో దృశ్యం సూపర్ హిట్ అయ్యింది.

మలయాళంలో దృశ్యం 2 సూపర్ హిట్ కావటంతో మళ్లీ అన్ని భాషల్లో రీమేక్ చేశారు. అంతేకాదు దృశ్యం 2 రిలీజ్ అయిన దగ్గర నుంచే దృశ్యం 3 గురించి కూడా చర్చ జరుగుతోంది. ఫైనల్‌గా దృశ్యం 3కి సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ ఇచ్చింది యూనిట్.

తొలి రెండు భాగాల్లో వర్క్ చేసిన సేమ్ టీమ్, త్రీక్వెల్ కోసం వర్క్ చేయబోతోంది. ఇక్కడే పడింది అసలు చిక్కుముడి. దృశ్యం 1, 2 రిలీజ్ టైమ్‌లో మలయాళ సినిమా పాన్ ఇండియా ఎరినాలో లేదు. కానీ ఇప్పుడు మాలీవుడ్ నుంచి కూడా నేషనల్ లెవల్ హిట్స్ వచ్చాయి.

ముఖ్యంగా మోహన్‌లాల్ మంచి సక్సెస్‌లు సాధించారు. దీంతో దృశ్యం 3ని మోహన్ లాల్ స్వయంగా పాన్ ఇండియా రేంజ్‌లో చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే ఇతర భాషల్లో ఆడియన్స్ కనెక్ట్ అవుతారా. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ వెంకటేష్ ప్లేస్‌లో మోహన్‌లాల్‌ను యాక్సెప్ట్ చేస్తారా..?

తమిళ, హిందీ భాషల్లో పరిస్థితి మరోలా ఉంది. తమిళ్‌లో దృశ్యం 2 చేయలేదు. ఇక పార్ట్ 3 ప్రస్తావనే లేదు. హిందీలో మాత్రం అజయ్ దేవగన్ సొంతగా దృశ్యం 3 కోసం కథ సిద్ధం చేసుకుంటున్నారు. ఆ కథతోనే ఈ థ్రిల్లర్ సిరీస్‌ను ముంగించబోతున్నారు. దీంతో తెలుగులోనే దృశ్యం 3 ఎలా ఉండబోతుంది అన్న సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. మరి ఈ థ్రిల్లింగ్ ట్విస్ట్‌కు మేకర్స్ ఎలాంటి శుభం కార్డ్ వేస్తారో చూడాలి.