
చాలా మంది ముద్దుగుమ్మలు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. గ్లామర్ పాత్రలు మాత్రమే కాదు అవకాశం వస్తే ఎలాంటి పాత్ర అయినా చేస్తున్నారు. ఇక పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ను గుర్తుపట్టారా.. తన అందంతో ప్రేక్షకులను కవ్విస్తుంది ఆ బ్యూటీ.

అలాగే నటనతోనూ ఈ అమ్మడు తోపే.. ఇంతకూ ఆమె ఎవరో కనిపెట్టారా.? ఆమె కేవలం నటి మాత్రమే కాదు నిర్మాత కూడా.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ఆమె. ఎవరో గుర్తుపట్టారా.? అందానికి కేరాఫ్ అడ్రస్ ఆమె..పై ఫొటోలో ఉన్న నటి ఎవరో కాదు మలయాళ ముద్దుగుమ్మ మంజు వారియర్.

తన 16వ ఏట 1995లో సాక్ష్యం అనే సినిమాతో తెరంగేట్రం చేసింది. మలయాళ ఇండస్ట్రీలో ఆమె ఎన్నో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే ఎన్నో పురస్కారాలు కూడా అందుకుంది. ఏ పళయుం కదన్ను సినిమాలోని నటనకుగానూ మంజు కేరళ రాష్ట్ర ఉత్తమ సినీ నటి పురస్కారం లభించింది. ఆ తరువాత ఆమె వరసగా నాలుగు సార్లు ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం గెలుచుకుంది మంజు.

పై డీ గ్లామర్ ఫోటో ఆమె నటించిన అసురన్ సినిమాలోది. ధనుష్ హీరోగా నటించిన అసురన్ సినిమాలో ఆమె అద్భుతంగా నటించింది. ఈ సినిమాలో ధనుష్ భార్యగా కనిపించింది మంజు. వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న వెట్టయన్ సినిమాలోనూ నటించి మెప్పించింది.

ఇటీవలే విజయ్ సేతుపతి హీరోగా నటించిన విడుదల 2లోనూ హీరోయిన్ గా చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మంజు వారియర్ రెగ్యులర్ గా తన ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. సినిమాల్లో నటించడంతో పాటు సినిమాలు నిర్మిస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది ఈ అందాల బొమ్మ.