
ప్రస్తుతం టాలీవుడ్ అవైటెడ్ ఫిల్మ్ వారణాసి. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది.

ఈ చిత్రాన్ని 2027లో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఈ మూవీ టైటిల్, మహేష్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మూవీపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ విలన్‌గా నటించనున్నారు.

ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుంది. చాలా కాలం తర్వాత భారతీయ మూవీ లవర్స్ ముందుకు రాబోతుంది ఈ అమ్మడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు ప్రియాంక దాదాపు రూ.30 కోట్లు పారితోషికం తీసుకుంటుందట.

ప్రస్తుతం ప్రియాంక చోప్రా భారతీయ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటిగా రికార్డు సృష్టించిందని అంటున్నారు. ఇటీవల జరిగిన టైటిల్ రిలీజ్ వేడుకలో తెల్ల లంగావోణిలో ట్రెడిషనల్ లుక్ లో దేవకన్యలా మెరిచింది.

సినిమాలో మందాకిని పాత్రలో కనిపించనుంది. అలాగే ఇటీవల విడుదలైన ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ మరింత పవర్ ఫుల్ గా కనిపించింది. ఇక ఇటీవల జరిగిన గ్లోబ్ ట్రోటర్ వేడుకలో మరింత అందంతో కట్టిపడేసింది.