Child Artist: ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఆ స్టార్ హీరో సరసన హీరోయిన్‏గా..

Updated on: Jul 12, 2025 | 8:22 PM

ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టుగా అలరించింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటిగా కనిపించి మెప్పించింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు హీరోయిన్ అయ్యింది. చిన్నప్పుడు అత్యధిక పారితోషికం తీసుకునే చైల్డ్ ఆర్టిస్టుగా రికార్డ్ క్రియేట్ చేసింది. 18 ఏళ్ల నిండకముందే దాదాపు రూ.10 కోట్ల ఆస్తులు సంపాదించింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..

1 / 5
భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే బాలనటి.. చిన్నప్పుడే ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఆమె మరెవరో కాదు.. సారా అర్జున్. ఐశ్వర్యరాయ్, విక్రమ్ వంటి స్టార్స్ తో కలిసి నటించిన ఈ చిన్నారి ఇప్పుడు హీరోయిన్ గా మారిన సంగతి తెలిసిందే.

2 / 5
సారా అర్జున్ ఆదిత్య ధార్ చిత్రం ధురంతర్ తో బాలీవుడ్ లో హీరోయిన్ గా అరంగేట్రం చేయనుంది. ఇందులో రణవీర్ సింగ్ జోడిగా కనిపించనుంది. ఇటీవల విడుదలైన 2 నిమిషాల టీజర్ ఆకట్టుకుంది. ఇందులో 20 ఏళ్ల సారా అందరి దృష్టిని ఆకర్షించింది.

3 / 5
సారా జూన్ 18, 2005న ముంబైలో జన్మించింది. తలైవి, డియర్ కామ్రేడ్, సీక్రెట్ సూపర్ స్టార్, తలైవి, వాచ్ మాన్ వంటి చిత్రాలలో  నటించిన నటుడు రాజ్ అర్జున్, సన్యా అర్జున్ దంపతుల కుమార్తె సారా అర్జున్. రెండేళ్ల వయసులోనే నటిగా సినీ ప్రయాణం స్టార్ట్ చేసింది.

4 / 5
సారా 18 నెలల వయసులోనే టీవీ వాణిజ్య ప్రకటనలలో నటించడం ప్రారంభించింది. ఆమెకు ఐదు సంవత్సరాల వయసు వచ్చేసరికి, ఆమె 100 కి పైగా వాణిజ్య ప్రకటనలలో కనిపించింది.  ఇన్‌స్టాగ్రామ్‌లో 59.6K ఫాలోవర్లను కలిగి ఉన్న సారా, మొదటగా తమిళంలో దైవ తిరుమకల్ (2011) చిత్రంతో దృష్టిని ఆకర్షించింది.

5 / 5
పొన్నియిన్ సెల్వన్‌లో ఐశ్వర్య రాయ్ చిన్న పాత్రలో నటించింది.  నివేదిక ప్రకారం, సారా ఒక సినిమాకు దాదాపు రూ.4 లక్షలు తీసుకునేది.  భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే బాలనటి కూడా. ఈ అమ్మాయి 18 ఏళ్లు నిండకముందే దాదాపు రూ.10 కోట్ల నికర విలువను సంపాదించింది.