
హీరో సుమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫ్యామిలీ, యాక్షన్, సినిమాలతో ఈయన ఎంతో మంది అభిమానుల మనసు గెలుచుకొని టాలీవుడ్ స్టార్ హీరోగా సత్తా చాటాడు. విలన్‌గా, హీరోగా , కమెడీయన్‌గా ఇలా ఏ పాత్రలోనైనా సరే ఒదిగిపోయి నటించేవారు. దీంతో ఈయనకు మంచి ఫ్యాన్ బేస్ పెరిగింది.

ఇక ఈయన వరస సినిమాలు చేస్తూ ఫుల్ జోష్‌లో ఉన్నక్రమంలోనే అనుకోనివిధంగా ఈయన కెరీర్‌కు బ్రేక్స్ పడ్డాయి. బ్లూ ఫిల్మ్ కేసులో ఈ హీరో జైలుకు వెళ్లి వచ్చిన సంగతి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఈయన దాదాపు ఆరు నెలలు జైలు ఉండి, తర్వాత నిర్ధోషిగా బయటకు వచ్చారు. కానీ ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆఫర్స్ ఎక్కువగా రాకపోవడం, చేసిన సినిమాలు అంతగా హిట్ అందుకోకపోవడంతో కెరీర్ డౌన్ ఫాలో అయ్యింది.

అయితే హీరో సుమన్ జైలులో ఉన్న సమయంలోనే హీరో రాజశేఖర్‌కు అదృష్టం తలుపు తట్టింది. వరసగా సినిమాలు చేస్తూ , స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే దీనికి ముఖ్యకారణం హీరో సుమన్ అంటూ ఎంతో మంది చర్చించుకున్నారు. సుమన్ చేసే సినిమలన్నీ రాజశేఖర్‌కు వద్దకు వెళ్లడంతో ఆయన వరసగా సినిమాలు చేసి స్టార్‌గా ఎదిగిపోయాడంట.

కాగా, తాజాగా దీనిపై హీరో సుమన్ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన కెరీర్‌కు సంబంధించిన అనేక విషయాలను అభిమానులతో పంచుున్నారు. అసలు తనకు సినిమా ఫీల్డ్ ఇష్టం లేదని, బలవంతంగా వచ్చాను, కానీ అభిమానుల ఆశీర్వాదంతో వరసగా అవకాశాలు రావడం , బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోవడం ఇలా జరుగుతూనే వచ్చింది.

ఇక నా వల్లే హీరో రాజశేఖర్ స్టార్ హీరో అయ్యాడు అనేది మాత్రం నేను అంగీకరించను. సినిమా రంగం ప్రతి ఒక్కరిదీ, టాలెంట్ ఉన్న వాళ్లు దూసుకెళ్తారు స్టార్స్‌గా మారిపోతారు , అలాగే తన టాలెంట్ వల్లే హీరో రాజ శేఖర్ స్టార్ అయ్యాడంటూ చెప్పుకొచ్చారు.