ఎప్పుడూ మన గురించి మనమే చెప్పుకోవడం ఏంటండీ . పక్కనోళ్లు చెప్పాలి... లేదా మనతో పని చేసే వాళ్లు చెప్పాలి... అలా చెప్పడమే కదా ట్రెండ్. భారీ భారీ ప్రాజెక్టుల గురించి అలాగే చెబుతున్నారు కదా.. అని అంటారా? యస్... ఈ ట్రెండ్ నాడి పట్టుకున్నారు దేవర మేకర్స్.
దేవర షూటింగ్ పూర్తి అయిందా? కాలేదా? ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ ని ఊరిస్తున్న విషయం ఇది. మా సినిమా షూటింగ్ పూర్తయిందోచ్ అని బాహాటంగా అనౌన్స్ చేసే అలవాటు కొరటాలకు ఎప్పుడూ లేదు.
ఆ సినిమాలు ఎప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తాయన్న విషయంలో మాత్రం క్లారిటీ రావటం లేదు. దీంతో దసరా సీజన్లో కూడా సందడి అనుకున్న రేంజ్లో ఉండదేమో అని ఫీల్ అవుతున్నారు మూవీ లవర్స్.
అయిన పార్టుకు అయినట్టు పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేస్తున్నారు. ఎటొచ్చీ సినిమా ఎలా వస్తోందన్నదే ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్. ఈ విషయం గురించి ఆలోచించేవారికోసమే ఆర్టిస్ట్ అజయ్ ఓ విషయాన్ని లీక్ చేశారు. దేవర కథ, స్క్రీన్‌ప్లే ఎవరూ ఊహించనంతగా ఉంటుందన్నది అజయ్ చెబుతున్న మాట.
తారక్ రేంజ్‌ని రెట్టింపు చేసే మూవీ అవుతుందట దేవర. పార్ట్ ఒన్ కోసం ప్రేక్షకులతో పాటు తాను కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నానని అంటున్నారు. ట్రిపుల్ ఆర్ తర్వాత తారక్ చేస్తున్న సినిమా, కొరటాల - తారక్ కాంబోలో రెండో సినిమా, జాన్వీకి ఫస్ట్ సౌత్ ఎంట్రీ మూవీ... ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ తో ట్రెండ్ అవుతోంది దేవర.