
తెలుగు సినిమాల్లో ప్రొఫెషనల్ ప్లేయర్స్ నటించడం కొత్తేం కాదు. అప్పట్లో అశ్వినీ నాచప్ప.. ఆ తర్వాత వివిఎస్ లక్ష్మణ్.. ఇలా చాలా మంది ప్లేయర్స్ నటించారు.

ఆ మధ్య వెంకటేష్ గురులో నటించిన రితిక సింగ్ కూడా ప్రొఫెషనల్ బాక్సరే. కానీ ఈ మధ్య కాలంలో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వైపు చూస్తున్నారు మన దర్శకులు.

రాబిన్ హుడ్ సినిమాలో డేవిడ్ వార్నర్ నటించారు. ఈ క్యారెక్టర్ గురించి చాలా బిల్డప్ ఇచ్చారు.. పైగా ప్రమోషన్స్ కోసం బానే వాడుకున్నారు. తీరా సినిమా చూస్తే వార్నర్ పాత్రకు స్కోప్ లేదు..

ఓ ఇంటర్నేషనల్ క్రికెటర్‌ను మరీ కమెడియన్‌లా చూపించారంటూ విమర్శలొస్తున్నాయి. దీనికంటే రాజమౌళితో చేసిన యాడ్ అదిరిపోయిందంటున్నారు వార్నర్ మామ ఫ్యాన్స్.

రెండేళ్ల కింద మైక్ టైసన్ విషయంలోనూ పూరీ జగన్నాథ్‌పై ఇలాంటి విమర్శలే వచ్చాయి. మా సినిమాలో టైసన్ ఉన్నాడంటూ బాగా ప్రమోట్ చేసుకుంది లైగర్ టీం. తీరా సినిమా విడుదలయ్యాక చూస్తే మైక్ టైసన్‌ను చాలా దారుణంగా చూపించారంటూ ఫైర్ అయ్యారు ఆయన ఫ్యాన్స్. మొత్తానికి అప్పుడు టైసన్.. ఇప్పుడు వార్నర్.. అలా మన దర్శకుల దగ్గర బుక్ అయిపోయారు.