
టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ హన్సిక గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ, తన క్యూట్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానుల మనసు దోచుకుంటుంది. బాలీవుడ్ వెండితెరపైకి చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మంచి ఫేమ్ సంపాదించుకుంది. తర్వాత హీరోయిన్‌గా బాలీవుడ్‌లో పలు సినిమాలు చేసి, తన నటనతో అందరినీ ఆకట్టుకుంది.

తర్వాత దేశ ముదురు మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి మూవీతోనే తన క్యూట్‌నెస్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. దీంతో ఈ అమ్మడుకు చాలా అవకాశాలు వచ్చాయి. స్టార్ హీరోల సరసన ఛాన్స్‌లు కొట్టేసి, అందరినీ ఆకట్టుకుంది.

తర్వాత కోలీవుడ్, బాలీవుడ్ చెక్కేసి, అక్కడ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తుంది.ఇక ఈ మధ్య ఈ అమ్మడు గురించి నెట్టింట ఎక్కువగా వినిపిస్తుంది. ఈ బ్యూటీ కెరీర్ పీక్స్ స్టేజ్‌లో ఉండగానే తన చిరకాల స్నేహితుడు సోహైల్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

అయితే ఈ మధ్య ఈ అమ్మడు తన భర్త నుంచి విడాకులు తీసుకోబోతున్నట్లు అనేక వార్తలు వస్తున్నాయి. దానికి తగ్గట్టు ఈ బ్యూటీ కూడా తన ఇన్ స్టా నుంచి వివాహ ఫొటోలు డిలీట్ చేయడం, ఈ వార్తలకు ఆజ్యం పోసినట్లు అయ్యింది. అలాగే, ఈ మధ్య ఎక్కువగా సింగిల్‌గా కనిపిస్తుంది.

ఇక ఈ వార్తల క్రమంలో ఈ బ్యూటీ నెట్టింట తెగ సందడి చేస్తుంది. తన క్యూట్ ఫొటోస్ షేర్ చేస్తూ నెట్టింట హల్ చల్ చేస్తుంది. తాజాగా చీరలో తన అందంతో అందరినీ మాయచేస్తుంది.