Combination: క్రాస్ఓవర్‌ కొలాబరేషన్ నయా ట్రెండ్.. అందరిది ఇదే ఫార్ములా..

Edited By: Prudvi Battula

Updated on: May 04, 2025 | 9:43 AM

ఉన్నచోటే ఉండిపోవాలని ఎవరూ అనుకోరు. నిన్నటితో పోలిస్తే ఇవాళ, ఇవాళ్టితో కంపేర్‌ చేస్తే రేపు ఎంతో కొంత ఎదగాలనే అనుకుంటారు. అలాంటి డెవలప్‌మెంట్ వరల్డ్ డయాస్‌ మీద ఇండియన్‌ సినిమా విట్‌నెస్‌ చేయాలంటే క్రాస్ఓవర్‌ కొలాబరేషన్స్ కంపల్సరీ అనే మాట వినిపిస్తోంది.

1 / 5
కలిసుంటే కలదు సుఖం అనే మాటను గట్టిగా చెప్పారు విజయ్‌ దేవరకొండ. ప్రపంచవ్యాప్తంగా మన సంస్కృతి, మన సంప్రదాయాలు, మన ఐడెంటెటీ, మన ఉనికి, మన సినిమా ఢంకా భజాయించాలంటే తప్పకుండా సక్సెస్‌ పలకరించాలి. అందులోనూ వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన స్టార్లు కలిసి సినిమా చేస్తే..?

2 / 5
వేవ్స్ లో 'సినిమా - ది సాఫ్ట్ పవర్‌' ప్యానెల్‌లో మాట్లాడారు విజయ్‌ దేవరకొండ. ఆయన మాటలతో అందరూ ఏకీభవిస్తున్నారు. కాంబినేషన్లు కంపల్సరీ.. అవి కాసులు కురిపిస్తాయి. వరల్డ్ వైడ్‌ మన పేరును మారుమోగిస్తాయి అని మాట్లాడుకుంటున్నారు.

3 / 5
ఆల్రెడీ నార్త్, సౌత్‌ మధ్య క్రాస్‌ ఓవర్‌ కల్చర్‌ స్టార్ట్ అయిందని.. వార్‌2 కాంబినేషన్‌ గురించి స్పెషల్‌గా ప్రస్తావించారు కరణ్‌ జోహార్‌. ఈ సినిమా రిలీజ్‌ కోసం బాలీవుడ్‌ ఎంతగా వెయిట్‌ చేస్తుందో చెప్పకనే చెప్పేసింది కరణ్‌ షేర్‌ చేసిన ఒపీనియన్‌.

4 / 5
ప్రస్తుతం సెట్స్ మీదున్న రామాయణంలోనూ క్రాస్‌ ఓవర్‌ కల్చర్‌ మరోసారి రిఫ్లక్ట్ కానుంది. రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌, రావణాసురుడిగా యష్‌ నటిస్తున్న ఈ సినిమాను చూడ్డానికి ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు జనాలు. ఆదిపురుష్‌లో ఫెయిల్‌ అయిన రామరావణ సంవాదం.. నార్త్ రామాయణంలో పండాలని కోరుకుంటున్నారు.

5 / 5
ఆదిపురుష్‌లో నార్త్, సౌత్‌ కాంబో క్లిక్‌ కాకపోయినా.. కల్కిలో మాత్రం జబర్దస్త్ గా హిట్‌ అయింది. సినిమా అంటే ఇది కదా.. అనేలా సక్సెస్‌ అయింది. అమితాబ్‌, ప్రభాస్‌ మధ్య సన్నివేశాలకు చప్పట్లు మారుమోగాయి. ఫ్యూచర్లోనూ ఇలాంటి కాంబినేషన్లు, ఇలాంటి సక్సెస్‌లు పునరావృతం కావాలనే మాట వినిపించింది వేవ్స్ వేదిక మీద.