
అందాల చిన్నది తెలుగు బ్యూటీ అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ అమ్మడు ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, తన గ్లామర్‌తో నెట్టింట సెగలు పుట్టిస్తుంటుంది. తాజాగా మరోసారి తన అందంతో కుర్రకారుకు బాణాలు విసిరింది.

మల్లేశం సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ, మొదటి సినిమాతోనే తన అందం, నటనతో ప్రతి ఒక్కరి మనసు దోచుకుంది. దీంతో ఈ అమ్మడుకు మంచి గుర్తింపు లభించింది. ఇక ఈ మూవీ తర్వాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలోనే ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ.

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసి, అందులో ఓ అమాయకపు అమ్మాయి పాత్రలో నటించి, తన నటనతో ఎంతో మదిని ఆకట్టుకుంది. ఏ మూవీతో రానీ క్రేజ్ ఈ అమ్మడుకు వకీల్ సాబ్‌తో వచ్చిందని చెప్పవచ్చు. ఇక ఈ మూవీ తర్వాత అనన్య లైఫ్ టర్న్ అయ్యిందనే చెప్పాలి.

ఈ మూవీ తర్వాత వరసగా ఆఫర్స్ అందుకుంటూ దూసుకెళ్తుంది. ప్రస్తుతం ఈ చిన్నది పలు సినిమాల్లో నటిస్తున్నట్లు సమాచారం. ఇక సినిమాల విషయం ఎలా ఉన్నా, ఈ బ్యూటీ మాత్రం సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది.వరస ఫొటో షూట్ తో కుర్రకారు మనసు దోచేస్తుంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్ స్టాలో క్రేజీ ఫొటోస్ షేర్ చేసింది. అందులో ఈ చిన్నది, బ్రౌన్ టాప్, బ్లాక్ జీన్స్ ధరించి అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. చెట్ల మధ్య క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ఉన్న ఈ ఫొటోస్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి.