
సంక్రాంతికి రావడమనేది హీరోలు ప్రస్టేజ్‌గా తీసుకుంటున్నారు. సీనియర్ హీరోలైతే ఏడాదికి ఒక్క సినిమా చేస్తే.. అది కచ్చితంగా పండక్కి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సంక్రాంతిని బాలయ్య తీసుకుంటే.. 2026 పొంగల్‌ను చిరంజీవి టార్గెట్ చేస్తున్నారు.

అనిల్ రావిపూడితో చిరు చేయబోయే సినిమా పండక్కి రానుంది. చిరంజీవి సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ ఈ మధ్యే వైజాగ్‌లో మొదలు పెట్టారు అనిల్ రావిపూడి. సమ్మర్ తర్వాత ఈ సినిమా సెట్స్‌పైకి రానుంది.

మూడు నెలల్లో టాకీ పూర్తి చేసి.. ఆర్నెళ్లలో సినిమా విడుదల చేయాలనేది అనిల్ ప్లాన్. చిరు కూడా దీనికే స్టిక్ అయ్యారు. అంతా బాగానే ఉంది కానీ చిరంజీవిని టార్గెట్ చేయడానికి మరో ఇద్దరు స్టార్ హీరోలు వచ్చే సంక్రాంతికి రానున్నారు.

రెండేళ్ళ కింద చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్య అంటూ పండక్కి వచ్చిన మాస్ రాజా.. 2026 సంక్రాంతికి మాత్రం చిరంజీవితో పోటీ పడబోతున్నారు. కిషోర్ తిరుమలతో ఈయన చేయబోయే సినిమా సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత రవితేజ చేయబోయే ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది.. పైగా ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగే కథ అని తెలుస్తుంది.

జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న డ్రాగన్ రిలీజ్ డేట్ జనవరి 9 అని ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. తారక్ వస్తే మాత్రం ఆ ఎఫెక్ట్ మామూలుగా ఉండదు. పైగా ప్రశాంత్ నీల్ కాబట్టి మాస్ రీచ్ నెక్ట్స్ లెవల్‌లో ఉంటుంది. అన్నీ కుదిరి 2026 సంక్రాంతికి చిరంజీవి, రవితేజ, ఎన్టీఆర్ సినిమాలొస్తే.. బాక్సాఫీస్‌కు పూనకాలు రావడం ఖాయం.