
బాసూ వేర్ ఈజ్ ద పార్టీ అని అడగడం లేదు మెగా అభిమానులు. బాసూ.. మీకు ఏ పార్టీ కావాలో చెప్పండి ఇచ్చేస్తాం అంటూ తెగ ఖుషీ అవుతున్నారు. అందుకు రీజన్.. మెగాబాస్ ఫుల్ ఫోకస్ ఇక ఆన్ లొకేషన్ అనే స్టేట్‌మెంటే.

ఇప్పుడు విశ్వంభర షూటింగ్‌లో ఉన్న చిరంజీవి... నెక్స్ట్ లైనప్ అంతా యంగ్‌స్టర్స్ తోనే ప్లాన్ చేసుకుంటున్నారు. చేతిలో ఉన్న సినిమాలు త్వరగా కంప్లీట్ చేసుకుని వచ్చేస్తే.. కాల్షీట్ ఇచ్చేస్తానంటూ నాగ్ అశ్విన్‌కి ఓపన్ ఆఫర్ ఇచ్చేశారు. కల్కిలో అమితాబ్, కమల్ కేరక్టర్లను నాగీ డీల్ చేసిన తీరు చూసి ముచ్చటపడిపోయారు చిరు.

ఆఫ్టర్ విశ్వంభర చిరు చేతిలో ఉన్నది అనిల్ రావిపూడి ప్రాజెక్ట్. ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళ్దామా అని ఉత్సాహంగా ఉందట మెగాస్టార్‌కి. ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా అవుతుందని రీసెంట్ స్టేజ్ మీద క్లారిటీ ఇచ్చేశారు చిరు.

త్వరలోనే శ్రీకాంత్ ఓదెల డైరక్షన్‌లో పక్కా మాస్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు మెగాస్టార్. అంతే కాదు.. ఇంద్రసేనారెడ్డి వర్సస్ సమరసింహారెడ్డి...అంటూ ఎవరైనా మంచి స్క్రిప్ట్ రాస్తే తప్పకుండా నటించడానికి ఉత్సాహంగా ఉన్నానన్నారు.

'బోయపాటీ చాలెంజ్ ఇస్తున్నా తీసుకో' అని చిరు అన్న మాటలు ఇప్పటికీ అప్పుడప్పుడూ వైరల్ అవుతూనే ఉన్నాయి. సో.. మెగాస్టార్ మరింత ఉత్సాహంగా సినిమాలు చేయాలనుకుంటున్నారని ఈ మాటలన్నీ ఎప్పటి నుంచో చెప్పకనే చెబుతున్నాయని రీకాల్ చేసుకుని మరీ ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్.