గణనాధునికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యం పాల ఉండ్రాళ్లు తయారీకి కావాల్సిన పదార్థాలు బియ్యపు పిండి : కప్పున్నర, పాలు : 2 1/2 కప్పులు, చక్కెర : 100 గ్రా, యాలకుల పొడి : చిటికెడు, సాబుదానా(సగ్గుబియ్యం) : 3 టేబుల్ స్పూన్స్, నూనె : పావు టీస్పూన్ ఒక గిన్నెలో తగినన్ని(ఒక కప్పు బియ్యం పిండికి రెండు కప్పులు)నీళ్లు, నూనె పోసి మరిగించాలి. అందులో బియ్యపు పిండి వేసి ఉండలు లేకుండా కలిపి కొద్దిగా చేతులకు నూనె రాసుకొని పిండిని చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇడ్లీ పాత్రలో కొన్ని నీళ్లు పోసి పక్కన పెట్టిన ఉండలను ఆవిరి మీద వీటిని ఉడికించిన తర్వాత ఈ లోపు గిన్నెలో పాలు పోసి మరిగించాలి. తర్వాత పాలల్లో సాబుదానా ఓ పావుగంట నానబెట్టుకోని చక్కెర, యాలకుల పొడి వేసి సన్నని మంటమీద పది నిమిషాలు ఉడికించాలి. కొద్దిగా బియ్యం పిండి వేసి చిక్కగా అయ్యేలా చూడాలి. ఆ తర్వాత ఉడికించిన ఉండ్రాళ్లను వేసి సన్నని మంట మీద నాలుగు నిమిషాలు ఉంచి దించేయాలి.