
పైన ఫోటోలో కనిపిస్తున్న అందాల ముద్దుగుమ్మను గుర్తుపట్టారా..? బుల్లితెరపై ఫేమస్ యాంకర్. నిత్యం అందంతోపాటు వాక్చాతుర్యంతో జనాలను కట్టిపడేస్తుంది. ఇప్పుడు ఈ అమ్మడు టీవీల్లో చాలా బిజీ. ఇంతకీ ఆమె ఎవరంటే..

ఆమె మరెవరో కాదండి.. సోషల్ మీడియా సెన్సేషన్, స్టార్ యాంకర్ శ్రీముఖి. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస రియాల్టీ షోలతో బిజీగా ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు నెట్టింట షేర్ చేసిన ఫోటోస్ జనాలను ఆకట్టుకుంటున్నాయి.

మోడ్రన్, గ్లామర్ ఫోజులతో శ్రీముఖి షేర్ చేసిన పిక్స్ అదిరిపోయాయి. కత్తిలాంటి చూపులతో కుర్రాళ్ల మతిపోగొడుతుంది. దీంతో ఇప్పుడు శ్రీముఖి గ్లామర్ ఫోజులు తెగ వైరలవుతున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు బిగ్ బాస్ అగ్నిపరీక్ష షోకు హోస్టింగ్ చేస్తుంది.

ఈ షో కోసం ఇలా గ్లామర్ లుక్ లోకి మారిపోయినట్లు తెలుస్తోంది. అగ్నిపరీక్ష లుక్స్ అంటూ ఈ అమ్మడు షేర్ చేసింది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై అత్యంత డిమాండ్ యాంకర్ గా మారింది.

నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టిన శ్రీముఖి...కెరీర్ మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. అల్లు అర్జున్ నటించిన జులాయి చిత్రంలో బన్నీ సోదరిగా కనిపించింది.

ఆ తర్వాత రామ్ పోతినేని సిస్టర్ గా నేను శైలజ చిత్రంలో కనిపించింది. అయితే నటనతో మంచి నటిగా ప్రశంసలు అందుకున్న శ్రీముఖికి సినిమాల్లో మాత్రం అంతగా అవకాశాలు రాలేదు. దీంతో ఈ బ్యూటీ ఇప్పుడు స్మాల్ స్క్రీన్ పైకి షిఫ్ట్ అయ్యింది.

అంతకు ముందు బిగ్ బాస్ షోలో పాల్గొన్న శ్రీముఖి తన ఆట తీరుతో జనాలను ఆకట్టుకుంది. ఈ షోలో రన్నరప్ గా నిలిచింది. ఆ తర్వాత వరుసగా రియాల్టీ షోలకు, ప్రోగ్రామ్స్ కు హోస్టింగ్ చేస్తూ బిజీగా ఉంటుం