1981లో డైరెక్టర్ భారతీరాజా దర్శకత్వం ఒయివతిల్లై సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత రజినీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ అందుకుంది. తమిళంలో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలోనే తెలుగులోకి అడుగుపెట్టింది. గోపాలకృష్ణుడు, అత్తకు తగ్గ అల్లుళ్లు, రాక్షసుడు, నాగు, ఆయుధం, అడవి దొంగ సినిమాల్లో నటించింది.