Dunki: షారుక్ ఖాన్ ‘డంకీ’ బడ్జెట్ అంత తక్కువా.. 100 కోట్లు కూడా కాదంట..!

| Edited By: Prudvi Battula

Nov 24, 2023 | 11:26 AM

ఈ రోజుల్లో మీడియం రేంజ్ సినిమా చేయాలన్నా కూడా బడ్జెట్ కనీసం 40 కోట్లు అవుతుంది. ఇక స్టార్ హీరోలతో సినిమా అంటే 100 కోట్ల నుంచి మొదలుపెడితే లెక్కలు వేయడం కూడా కష్టం అవుతుంది. ఫ్యామిలీ సినిమాలను కూడా వందల కోట్లతో తెరకెక్కించడం ఫ్యాషన్‌గా చేసుకున్నారు దర్శకులు. తక్కువ బడ్జెట్‌తో సినిమా చేస్తే.. అదేదో చీప్ సినిమా తీసినట్లు ఫీల్ అవుతున్నారు వాళ్లు. ఇలాంటి సమయంలో ఓ భారీ సినిమా.. బాలీవుడ్ సినిమా.. అందులోనూ వరసగా రెండుసార్లు 1000 కోట్లు అందుకున్న హీరో సినిమాకు ఎంత బడ్జెట్ అవుతుంది చెప్పండి..? మనం మాట్లాడుకునేది షారుక్ ఖాన్ డంకీ గురించే..

1 / 5
రాజ్ కుమార్ హిరాణీ లాంటి సెన్సేషనల్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న డంకీ సినిమా డిసెంబర్ 21న విడుదల కానుంది. ఈ క్రిస్మ‌స్‌కు భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌ల కానుంది డంకీ. ఇప్ప‌టికే ఈ ఏడాది ప‌ఠాన్, జ‌వాన్ 1000 కోట్లు వసూలు చేయడంతో.. హ్యాట్రిక్ అందుకుంటాడని నమ్మకంగా ఉన్నారు ఆయన అభిమానులు. పైగా రాజ్ కుమార్ హిరాణికి కూడా మార్కెట్ మామూలుగా లేదు.

2 / 5
ఆయన చేసిన ప్రతీ సినిమా బాలీవుడ్‌లో ఓ ట్రెండ్ సెట్ చేసింది. మున్నాభాయ్ ఎంబిబిఎస్, లగేరహో మున్నాభాయ్, 3 ఇడియట్స్, పీకే, సంజు లాంటి సినిమాలన్నీ సంచలనాలే. ఇప్పుడు డంకీతో వస్తున్నాడు రాజ్‌కుమార్. దీనిపై కూడా అంచనాలు అలాగే ఉన్నాయి. పైగా ప్రభాస్ స‌లార్‌తో పోటీ పడుతున్నాడు షారుక్. డైనోసర్ రేసులో ఉన్నా.. నేను కూడా డైనోసరే అంటున్నాడు కింగ్ ఖాన్. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం వచ్చింది.

3 / 5
అది తెలిసిన తర్వాత అందరూ షాక్ అవుతున్నారు. షారుక్ ఖాన్, రాజ్ కుమార్ హిరాణీ.. ఈ కాంబినేష‌న్ చూసే బడ్జెట్ ఈజీగా 300 కోట్లు అయ్యుంటుంది అనుకుంటున్నారు కదా.. కానీ అక్కడ సినిమాకు అయింది కేవలం 80 కోట్లు మాత్రమే తెలుస్తుంది. డంకీ సినిమాను కేవలం 80 కోట్లతో నిర్మించారని తెలుస్తుంది. ఈ సినిమాను షారుక్ బార్య గౌరీతో కలిసి దర్శకుడు రాజ్ కుమార్ హిరాణియే సొంత నిర్మాణ సంస్థలో నిర్మించారు.

4 / 5
.ఈ ఇద్దరికి రెమ్యునరేషన్స్ ఉండవు కాబట్టి అక్కడే దాదాపు 250 కోట్లు మిగిలిపోయాయి. అయితే ప్రొడ‌క్ష‌న్ అయినా భారీగా అయ్యుంటుందేమో అనుకుంటే.. దానిపై కూడా కేవలం 80 కోట్లు మాత్రమే ఖర్చు చేసారని తెలుస్తుంది. అసలు షారుక్ ఖాన్ రేంజ్‌కు 80 కోట్లు అంటే నథింగ్ మ్యాటర్. జవాన్ సినిమాకు కేవలం మొదటి రోజు కలెక్షన్స్ 140 కోట్లు వచ్చాయి.. పఠాన్‌కు 105 కోట్లు వచ్చాయి. ఇప్పుడు డంకీకి ఫస్ట్ డే 150 కోట్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ సినిమా బిజినెస్ 400 కోట్ల వరకు జరుగుతుంది.

5 / 5
అది కూడా కేవలం థియెట్రికల్ బిజినెస్ మాత్రమే.. నాన్ థియెట్రికల్ మరో 300 కోట్ల వరకు జరుగుతుంది. అంటే విడుదలకు ముందే డంకీ బ్లాక్‌బస్టర్ అన్నమాట. ప్రొడక్షన్ కాస్ట్ పక్కనబెడితే కేవలం లాభాలే 500 కోట్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో..? రెమ్యునరేషన్స్ ఎలాగూ లేవు కాబట్టి ఈ సినిమా బడ్జెట్ తక్కువగా అయింది.. కానీ అందులోనూ ప్రొడక్షణ్ కోసం కూడా చూసి ఖర్చు చేసారు మేకర్స్. ఈ ప్లానింగ్ మిగిలిన దర్శకులకు కూడా ఉంటే.. ఎంత పెద్ద హీరోతో సినిమా చేసినా కూడా ఖర్చు 100 కోట్లు కూడా దాటదు. అదే జరిగితే నిర్మాతలకు కూడా లాభాలు మామూలుగా రావు. 