- Telugu News Photo Gallery Cinema photos Brahmamudi Serial Fame Rudrani Alias Sharmitha Gowda Latest Photos Goes Viral telugu movie news
Brahmamudi Serial Rudrani: సీరియల్లో అత్తగా.. నెట్టింట అందాల రాశిగా.. బ్రహ్మముడి రుద్రాణి గ్లామర్ లుక్ అదిరిందిగా..
ప్రస్తుతం బుల్లితెరపై టీఆర్పీ రేటింగ్లో అగ్రస్థానంలో దూసుకుపోతున్న సీరియల్స్ లో బ్రహ్మముడి ఒకటి. ఇందులో నెగిటివ్ పాత్ర రుద్రాణిగా అదరగొటేస్తుంది షర్మిత గౌడ. రాహుల్ తల్లిగా.. స్వప్నగా అత్తగా కనిపిస్తూ బ్రహ్మముడి సీరియల్లో తన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది రుద్రాణి అలియాస్ షర్మిత. ఇందులో నెగిటివ్ పాత్రలో పవర్ ఫుల్ విలన్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్స్ లో స్వప్న, రుద్రాణి,
Updated on: Jun 25, 2024 | 12:40 PM

ప్రస్తుతం బుల్లితెరపై టీఆర్పీ రేటింగ్లో అగ్రస్థానంలో దూసుకుపోతున్న సీరియల్స్ లో బ్రహ్మముడి ఒకటి. ఇందులో నెగిటివ్ పాత్ర రుద్రాణిగా అదరగొటేస్తుంది షర్మిత గౌడ. రాహుల్ తల్లిగా.. స్వప్నగా అత్తగా కనిపిస్తూ బ్రహ్మముడి సీరియల్లో తన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది రుద్రాణి అలియాస్ షర్మిత.

ఇందులో నెగిటివ్ పాత్రలో పవర్ ఫుల్ విలన్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్స్ లో స్వప్న, రుద్రాణి, కావ్య మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. అటు కామెడీ యాంగిల్.. ఇటు విలన్ గా కనిపిస్తూ మెప్పిస్తుంది. నెగిటివ్ షేడ్స్ ఉన్న రుద్రాణి పాత్రలో చక్కగా ఒదిగిపోయింది.

సీరియల్లో చీరకట్టులోనే కాస్త ట్రెండీ అండ్ స్టైలీష్ గా కనిపిస్తుంది రుద్రాణి. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే షర్మిత.. ఫోటోషూట్స్, రీల్స్ అంటూ తెగ సందడి చేస్తుంది. రకరకాల ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా గ్లామర్ లుక్ ఫోటోస్ పంచుకుంటూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది.

తాజాగా రుద్రాణి లేటేస్ట్ ఫోటోషూట్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. చీరకట్టులో మరింత అందంగా కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తుంది షర్మిత. సోషల్ మీడియాలో రుద్రాణికి చాలా క్రేజ్ ఉంది. నెట్టింట ఎప్పుడూ గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ సందడి చేస్తుంది. కానీ సీరియల్లో మాత్రం అమ్మగా విలనిజం పండిస్తూ కోట్ల ఆస్తికి తన కొడుకుని వారసుడిని చేయాలని చూస్తుంది.

ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్లో రుద్రాణిగా మెప్పిస్తున్న షర్మిత గౌడ వయసు కేవలం 32 ఏళ్లు మాత్రమే. 1990 నవంబర్ 20న షర్మిత గౌడ జన్మించింది. కానీ వయసుతో సంబంధం లేకుండా సీరియల్లో అత్తగా, అమ్మగా కనిపిస్తుంది షర్మిత. మోడలింగ్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసి 2017లో మిస్ కర్ణాటక గా గెలిచింది.




