
స్త్రీ 2 సినిమాకు ఏకంగా 700 కోట్లు రావడంతో.. బాలీవుడ్‌లో దెయ్యాల సినిమాలపై మరోసారి గిరాకీ పెరిగింది. అవసరం ఉన్నా లేకపోయినా.. ఓ దెయ్యం సినిమా తీస్తే సరిపోద్దిలే అనుకుంటున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా ఫామ్‌లో లేని సంజయ్ దత్ కూడా భూతిని అంటూ డెవిల్ స్టోరీతో వచ్చేస్తున్నారు. మే 1న విడుదల కానుంది ఈ చిత్రం. తనకు హీరోగా మార్కెట్ లేదని తెలిసినా.. దెయ్యంపై నమ్మకంతో భూతిని చేస్తున్నారు సంజయ్ దత్.

సిద్ధాంత్ సచ్‌దేవ్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ పూర్తిగా దెయ్యాలకు పుట్టిల్లుగా మారిపోయింది. స్త్రీ 2, భూల్ భులయ్యా 3, ముంజియా లాంటి సినిమాలు కాసులు కురిపించడంతో.. అంతా అటు వైపు పరుగులు పెడుతున్నారు.

కాస్త భయపెట్టి నవ్విస్తే చాలు వందల కోట్లు ఇచ్చేస్తున్నారు ఆడియన్స్. అందుకే అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు మేకర్స్. మ్యాడాక్ ఫిల్మ్స్ అయితే.. రాబోయే మూడేళ్లలో తమ బ్యానర్ నుంచి ఏకంగా 8 హార్రర్ సినిమాలను తీసుకొస్తున్నారు.

స్త్రీ 3, భేడియా 2, ముంజియా 2, పెహ్లా మహాయుధ్, దూస్రా మహాయుధ్, శక్తి షాలిని లాంటి సినిమాలు ఈ బ్యానర్ నుంచి రానున్నాయి.