ఒకప్పుడు బాలీవుడ్ బ్యూటీస్ టాలీవుడ్ వైపు చూడాలంటే.. నిర్మాతల ఆస్తులు కరిగిపోయేవి. వాళ్ల కండీషన్స్ ప్రొడ్యూసర్స్‌కు కాంతారాలో హీరో అరుపుల్లా భయంకరంగా వినబడేవి. కానీ ఇప్పుడు కాస్త బెటర్. ఎలాగూ టాలీవుడ్ దెబ్బ బాలీవుడ్‌పై బాగానే ఉంది కాబట్టి తెలుగులో నటించడమే బెటర్ అని ఫిక్సైపోయారు ముద్దుగుమ్మలు. అలాగని బాంబేను వదలట్లేదు.. బోనస్‌గా హైదరాబాద్‌లోనూ జెండా పాతేస్తున్నారు.

కావాలంటే కియారా అద్వానీనే తీసుకోండి.. బాలీవుడ్‌లో ఈమె స్టార్ హీరోయిన్. వరస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. అక్కడ బానే ఉందిగా.. ఇంక టాలీవుడ్ ఎందుకు అనుకుంటున్నారా..? లేదే.. ఇక్కడా బిజీ అవుతున్నారు. గేమ్ ఛేంజర్‌లో కియారానే హీరోయిన్.

ఇక ఇన్నాళ్లూ హిందీలోనే ఉన్న శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.. దేవరతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు. దీంతో పాటు రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాలో కూడా కథానాయకిగా నటిస్తుంది.

కెరీర్ కొత్తలో నేనొక్కడినే, దోచేయ్ సినిమాలు చేసిన కృతి సనన్.. గతేడాది ఆదిపురుష్‌తో తెలుగు ఆడియన్స్‌ను పలకరించారు. ఛాన్స్ ఉంటె ఇంకా తెలుగు సినిమాల్లో చేయడానికి సిద్ధంగా ఉంది ఈ బ్యూటీ.

కెరీర్ కొత్తలో నేనొక్కడినే, దోచేయ్ సినిమాలు చేసిన కృతి సనన్.. గతేడాది ఆదిపురుష్‌తో తెలుగు ఆడియన్స్‌ను పలకరించారు. ఛాన్స్ ఉంటె ఇంకా తెలుగు సినిమాల్లో చేయడానికి సిద్ధంగా ఉంది ఈ బ్యూటీ.