
బాలీవుడ్ అంటే ఈ జనరేషన్‌కు కేవలం షారుక్, సల్మాన్, అమీర్, అక్షయ్ కుమార్ లాంటి హీరోలే గుర్తుకొస్తారు.. ఇంకాస్త లేటస్ట్ అయితే రణ్‌వీర్ సింగ్, రణ్‌బీర్ కపూర్ అంటారు.. కానీ వీళ్ళందరి కంటే ముందే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ ఒకరున్నారు అక్కడ.. అతడే సన్నీ డియోల్.

ఫేడవుట్ అయిన ఈ హీరో.. రెండేళ్లుగా మళ్లీ రచ్చ చేస్తున్నారు. గదర్ 2 తర్వాత తాజాగా జాట్‌తోనూ మెప్పించారీయన. ఒక్క హిట్టు చాలు మునిగిపోయిన కెరీర్ మళ్లీ పైకి తేలడానికి..! బాలీవుడ్‌లో సన్నీ డియోల్ విషయంలోనూ ఇదే జరుగుతుంది.

20 ఏళ్ళుగా ఒక్క హిట్టు కూడా లేని ఆయనకు.. గదర్ 2తో బ్లాక్‌బస్టర్ వచ్చింది.. ఈ సినిమా ఏకంగా 600 కోట్లు వసూలు చేసింది. తాజాగా జాట్ సినిమా కూడా 100 కోట్ల వైపు పరుగులు తీస్తుంది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ ప్రకటించారు మేకర్స్.

సన్నీ డియోల్ ఒకప్పుడు సూపర్ స్టార్.. మాస్‌కు కేరాఫ్ అడ్రస్ సినిమాలు.. అతడి సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ భయపడిపోయేది.. అలాంటి ఫేడవుట్ అయిన ఈ స్టార్.. గదర్ 2తో 600 కోట్లకు పైగా వసూలు చేసి బ్యాక్ టూ ఫామ్ అనిపించారు.

సల్మాన్, అమీర్, అక్షయ్ సినిమాలే 100 కోట్లు దాటడానికి ముక్కీ మూలుగుతుంటే.. 20 ఏళ్ళ తర్వాత వచ్చిన ఈ సీక్వెల్ ఊర మాస్ రికార్డులు తిరగరాసింది. 80, 90ల్లో త్రిదేవ్, ఘాయల్, నరసింహ, గదర్, బోర్డర్, జీత్, విశ్వాత్మ లాంటి సినిమాలతో సన్నీ డియోల్ ప్రభంజనమే సృష్టించారు. తాజాగా జాట్ 2తో పాటు గదర్ 3, బోర్డర్ 2 సినిమాలు కూడా చేయబోతున్నారు సన్నీ డియోల్. వరసగా సీక్వెల్స్ ప్రకటిస్తూ.. బిజీ అయిపోయారు సన్నీ.