
కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు కన్నడ హీరో యష్. ఈ ఒక్క సినిమా యష్ ఇమేజ్‌ను తారా స్థాయికి తీసుకెళ్లింది. ఈ సినిమా తరువాత యష్ మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అందుకే ఆ రేంజ్ సినిమానే చేయాలన్న ఉద్దేశంతో నెక్ట్స్ మూవీని ఫైనల్ చేయడానికి చాలా టైమ్ తీసుకున్నారు రాకీభాయ్.

కేజీఎఫ్ 2 ప్రమోషన్స్ తరువాత చాలా రోజులు మీడియాకు దూరంగా ఉండిపోయిన రాకీభాయ్ కొద్ది రోజుల క్రితం తన నైన్టీన్త్ మూవీకి సంబంధించి క్లారిటీ ఇచ్చారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో టాక్సిక్ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చారు.

మూవీ ఎనౌన్స్‌మెంట్ తరువాత మళ్లీ సైలెంట్ మోడ్‌లోకి వెళ్లారు యష్. జనవరి 8న బర్త్ డే సందర్భంగా షూటింగ్ అప్‌డేట్, కాస్ట్ అండ్ క్రూ డీటైల్స్ రివీల్ చేస్తారని భావించినా, యూనిట్ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. తాజాగా యష్ మూవీ విషయంలో ఇంట్రస్టింగ్ హింట్ ఇచ్చారు ఓ బాలీవుడ్ బ్యూటీ.

టాక్సిక్‌లో యష్‌కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ నటిస్తారన్న ప్రచారం సోషల్ మీడియా వేదికగా చాలా రోజులుగా జరుగుతోంది. రీసెంట్‌గా కరీనా కూడా ఓ ఇంటర్వ్యూలో ఈ రూమర్స్‌కు మరింత బలాన్నిచ్చే కామెంట్ చేశారు.

ప్రజెంట్ క్రూ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్.. ఓ ఇంటర్వ్యూలో త్వరలో సౌత్ ఇండస్ట్రీలో ఓ పాన్ ఇండియా మూవీలో నటించబోతున్నట్టుగా చెప్పారు. దీంతో ఆమె చెప్పింది టాక్సి గురించే అని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్.