Mrunal Thakur: పెళ్లి చేసుకుని.. పిల్లలు కనాలని ఉంది.. కానీ అది ఒక్కటే ప్రాబ్లెమ్

Edited By: Phani CH

Updated on: Aug 06, 2025 | 6:27 PM

హీరోయిన్లు పెళ్లి గురించి మాట్లాడాలంటే వాళ్ల కెరీర్‌ సంప్‌లో ఉండాలి. లేకుంటే చాన్నాళ్లుగా ప్రేమకు సంబంధించిన వార్తలు వైరల్‌ అవుతూ ఉండాలి. లేకుంటే, ఏదో సడన్‌ బ్రేక్‌ రావాలి. అలాంటివేమీ లేనప్పుడు పెళ్లి ముచ్చట రావడం అరుదు. కానీ నేను డిఫరెంట్‌ కదా.. అందుకే ఓపెన్‌ అయిపోతున్నానని అంటున్నారు సిల్వర్‌ స్క్రీన్‌ కమర్షియల్‌ సీత... అదేనండీ మృణాల్‌ ఠాకూర్‌. పెళ్లి గురించి మృణాల్‌ ఏమన్నారో తెలుసా?

1 / 5
నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది.. పిల్లలు కనాలని ఉంది అని అంటున్నారు మృణాల్‌ ఠాకూర్‌ అదేదో జస్ట్ ఇప్పుడు పుట్టిన ఆలోచన కాదు. ఎప్పటి నుంచో ఉంది. నా చిన్నప్పటి నుంచీ నాదైన కుటుంబం మీద నాకు చాలా క్లారిటీ ఉంది అని చెబుతున్నారు.

2 / 5
కెరీర్‌ పీక్స్ లో ఉన్నప్పుడు ఈ మాటలేంటని విన్నవారందరూ వండర్‌ అవుతున్నారు. కెరీర్‌కీ, పెళ్లికి సంబంధం ఉందా? అంటే కచ్చితంగా ఉంటుందనే అంటున్నారు మృణాల్‌. ఇప్పుడు డైరీల్లో కాల్షీట్లన్నీ ఫుల్‌గా ఉన్నాయి.

3 / 5
ఏడాదికి రెండు, మూడు సినిమాల రిలీజులున్నాయి. వాటి షూటింగులు, ప్రమోషన్లు, డబ్బింగ్‌లూ అంటూ చాలా బిజీగా ఉన్నాను. అందుకే పెళ్లి ఇమీడియేట్‌గా చేసుకోవాలని అనుకోవడం లేదని స్టేట్‌మెంట్‌ ఇచ్చేశారు.

4 / 5
పెళ్లి గురించి ఇంతగా మాట్లాడుతున్నారంటే.. మనసులో ఎవరైనా ఉన్నారా? అనే అనుమానాలు వెంటనే మొదలవుతాయి. అలాంటిదేమీ లేదు. సరైన టైమ్‌ వచ్చినప్పుడు అన్నీ పర్ఫెక్ట్ గా కుదురుతాయన్నది నా నమ్మకం అని అడగబోయే ప్రశ్నకు ముందుగానే ఆన్సర్‌ ఇచ్చేస్తున్నారు ఈ లేడీ.

5 / 5
నార్త్ లో వరుసగా ప్రాజెక్టులు సైన్‌ చేస్తున్నారు మృణాల్‌. సౌత్‌లో అల్లు అర్జున్‌ - అట్లీ మూవీలోనూ మంచి రోల్‌ చేస్తున్నారు. కోలీవుడ్‌ నుంచి చాలా మంది కథలు వినిపిస్తున్నారట. బిజీగా ఉండాలనో, సంపాదించేయాలనో సినిమాలు చేయట్లేదట మృణాల్‌. మంచి సబ్జెక్టులో ఇన్వాల్వ్ అయితే ఆ కిక్కే వేరన్నది ఈ లేడీ ఫీలింగ్‌. గుర్తుండిపోయే సినిమాలు చేయాలన్నదే టార్గెట్‌ అంటున్నారు హాయ్‌ నాన్న బ్యూటీ.