
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మొదటి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్య మోక్ష ఎంట్రీ ఇచ్చింది. సోషల్ మీడియా పాపులారిటీ, పికిల్స్ బిజినెస్, నాన్న చనిపోవడం, ట్రోల్స్ ఇలా అన్ని విషయాల గురించి ఓపెన్ గా మాట్లాడింది రమ్య.

రెండో వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా టాలీవుడ్ యంగ్ హీరో శ్రీనివాస్ సాయి ఎంట్రీ ఇచ్చాడు. గోల్కోండ హై స్కూల్, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాల్లో నటించిన సాయి వినరా సోదర వీర కుమార సినిమా లో హీరోగా చేశాడు.

ఇక దువ్వాడ (దివ్వల) మాధురి అటు సోషల్ మీడియాలోనూ, ఇటు మొయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇప్పుడు బిగ్ బాస్ హోస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి.

లుకే బంగారమాయనే, గృహలక్ష్మి సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు నిఖిల్ నాయర్. ఇప్పుడు బిగ్ బాస్ తో మరింత క్రేజ్ సొంతం చేసుకుందామని హౌస్ లోకి అడుగు పెట్టాడు.

సావిత్రి గారి అబ్బాయి సీరియల్, కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షోతో బాగా ఫేమస్ అయిన ఆయేషా జీనథ్ గతంలో తమిళ్ బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసింది. ఇప్పుడు మరోసారి ఈ రియాలిటీ షోలో అదృష్టం పరీక్షించుకోనుంది

గీత ఎల్ఎల్బీ సీరియల్ తో గుర్తింపు తెచ్చుకున్న నటుడు గౌరవ్ గుప్తా బిగ్ బాస్ 9 తెలుగు హౌస్ లోకి ఆరో వైల్డ్ కార్డుగా ఎంట్రీ ఇచ్చాడు. ఇతడికి తెలుగు నేర్పించమని దివ్య నికితాకు బాధ్యతలు అప్పజెప్పారు నాగ్.