Rajeev Rayala |
Updated on: Nov 30, 2023 | 7:56 PM
బిగ్ బాస్ వల్ల చాలా మంది క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇప్పటికే ఈ గేమ్ షో వల్ల పాపులారిటీ తెచ్చుకున్న భామల్లో అలేఖ్య హారిక ఒకరు.
బిగ్ బాస్ కంటే ముందు హారిక.. సోషల్ మీడియాలో వీడియోలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది.
ఆతర్వాత ఈజ్ బాస్ సీజన్ 4 లో ఛాన్స్ దక్కించుకుంది. బిగ్ బాస్ 4లో తన గేమ్ స్ట్రాటజీతో ఆకట్టుకుంది ఈ చిన్నది. అలాగే టాప్ 5 కు కూడా వచ్చింది.
బిగ్ బాస్ తర్వాత ఈ బ్యూటీకి సినిమా ఆఫర్స్ వస్తాయని అంతా అనుకున్నారు. కానీ ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది.
తాజాగా ఈ చిన్నది కొత్త ఇల్లు కొన్నది. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలో తన సోషల్ మీడియాలో స్టోరీలో పోస్ట్ చేసింది హారిక.