బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ ప్రారంభంలో అడుగు పెట్టిన 14 మంది కంటెస్టెంట్స్ లో ఢీ ఫేమ్ నైనిక కూడా ఒకరు. షో ప్రారంభంలో నైనిక ఎంతో ఎనర్జిటిక్ గా, పాజిటివ్ గా కనిపించిందీ ఫేమస్ డ్యాన్సర్. టాస్కుల్లో కూడా యాక్టివ్ గా పార్టి సిపేట్ చేసింది.
తన ఆట, మాటతీరుతో బిగ్ బాస్ ఆడియెన్స్ మనసులు గెల్చుకుంది. ముఖ్యంగా క్లాన్ (టీమ్) లీడర్‌గా ఎదిగేందుకు నైనిక ఆడిన గేమ్ బిగ్ బాస్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.
బిగ్ బాస్ హౌస్ లో అబ్బాయిలకు గట్టి పోటీ ఇచ్చిన ఏకైక లేడీ కంటెస్టెంట్ గా కనిపించిన నైనిక.. ఎందుకో గానీ క్రమక్రమంగా పూర్తిగా డల్ అయిపోయింది.
స్నేహితులతో ముచ్చట్లు పెట్టడం తప్ప టాస్కులు, గేమ్స్ లో పెద్దగా యాక్టివ్ గా పాల్గొనలేకపోవడంతో ఐదో వారమే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది నైనిక.
ఐదో వారం నామినేషన్స్ లో నిలిచిన నైనికకు తక్కువ ఓట్లు పడ్డాయి. దీంతో ఈ ఢీ డ్యాన్సర్ కు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాక తప్పలేదు.
కాగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక గ్లామర్ డోస్ బాగా పెంచేసింది నైనిక. తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలే ఇందుకు నిదర్శనం.