
అల్లుడు శ్రీనుతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు బెల్లంకొండ శ్రీనివాస్.. ఈ సినిమా కాస్ట్ ఫెయిల్యూర్‌గా నిలిచినా డెబ్యూ హీరోకు పర్ఫెక్ట్ ఎంట్రీగా నిలిచింది.

దీని తర్వాత స్పీడున్నోడు పోయినా.. జయ జానకీ నాయకాతో మాస్‌కు బాగా చేరువయ్యారు బెల్లంకొండ. మాస్ సినిమాలు చేస్తూనే సీత, రాక్షసుడు లాంటి డిఫెరెంట్ సినిమాలు ట్రై చేసారు ఈ కుర్ర హీరో.

తెలుగుతో పాటు హిందీలోనూ బెల్లంకొండకు మంచి గుర్తింపు ఉంది.. ముఖ్యంగా యూ ట్యూబ‌్‌లో ఈ హీరో సినిమాలకు అదిరిపోయే క్రేజ్ ఉంది. జయ జానకీ నాయకాకు యూ ట్యూబ్‌లో 953 మిలియన్ వ్యూస్ వచ్చాయి.. ఇక సీత హిందీ వర్షన్‌కు 700 మిలియన్, కవచం సినిమాకు 400 మిలియన్ల వ్యూస్ ఉన్నాయి.

ఛత్రపతితో నేరుగా నార్త్ ఆడియన్స్‌ను పలకరించారు బెల్లంకొండ.గుర్తింపు ఉన్నా.. కొన్నేళ్లుగా కోరుకున్న హిట్ రావట్లేదు బెల్లంకొండకు. మొన్నొచ్చిన భైరవం సైతం అంచనాలు అందుకోలేదు. ప్రస్తుతం కిష్కింధపురితో వస్తున్నారు ఈ హీరో.

సెప్టెంబర్ 12న విడుదల కానున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. చూడాలిక.. ఈ సినిమాతో బెల్లంకొండ హిట్ కొడతారా లేదా అనేది.