- Telugu News Photo Gallery Cinema photos Beautiful photos of Telugu beauty Ananya Nagalla in traditional look during Ugadi festival
ఉట్టిపడుతున్న తెలుగు అందం.. అనన్యనాగళ్లను చూశారా..
ఉగాది రోజున చాలా మంది నటీమణులు ట్రెడిషనల్ లుక్ లో అందంగా ముస్తాబై, ఫొటోలకు ఫోజులిచ్చారు. అందులో తెలంగాణ పిల్లా తెలుగు బ్యూటీ అనన్య నాగళ్ల కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. లంగావోణిలో చూడటానికి చాలా అందంగా కనిపించి. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి మనం కూడా చూసేద్దాం పదండి!
Updated on: Mar 31, 2025 | 12:03 PM

అందాల ముద్దుగుమ్మ అనన్యనాగళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీతో మంచి ఫేమ్ సంపాదించుకుంది ఈ చిన్నది.

ఈ మూవీ తర్వాత ఈ బ్యూటీకి చాలా సినిమాల్లో అవకాశాలు రావడంతో వరసగా వెబ్ సిరీస్ లు, సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. అంతే కాకుండా ఈ ముద్దుగుమ్మ సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తుంటుంది.

అంతే కాకుండా వరస ఫొటో షూట్స్ చేస్తూ.. కుర్రకారును తన వైపుకు లాక్కుంటుంది. ఇక తాజాగా ఈ చిన్నది తన ఇన్ స్టాలో ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫొటోలు షేర్ చేసింది.

ఉగాది పండుగ సందర్భంగా లంగావోణీలో అందంగా తయారైంది ఈ తెలుగు పిల్ల. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ ఫొటోస్ చూసిన నెటిజన్స్, అనన్యను చూస్తే తెలుగు అందం ఉట్టిపడుతుంది. పరికిణిలో ఎంత ముద్దుగుందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ అమ్మడు అభిమానులు.



