
పెళ్లి సందD మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ శ్రీలీల. ఈ అందాల ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే తన అందంతో అందరినీ తన వైపుకు తిప్పుకుంది, అందమే కాకుండా ,డ్యాన్స్, నటనతో అందరినీ మాయ చేసి, యూత్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత ఈ అందాల చిన్నదానికి వరసగా అవకాశాలు క్యూ కట్టాయి.

తర్వాత మాస్ మహారాజా రవితేజ సరసన ధమాకా సినిమాలో నటించి, మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ మూవీలో ఈ అమ్మడు డాన్స్, నటనతో విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకొని, టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌గా మంచి పేరు సంపాదించుకుంది. ఇక ఈ మూవీ తర్వాత ఈ బ్యూటీకి వరసగా అవకాశాలు తలుపు తట్టాయి.

వరసగా, గుంటూరు కారం, ఆది కేశవ, ఎక్సట్రార్డినరీ మ్యాన్, భగవంత్ కేసరి, స్కంద వంటి చాలా సినిమాల్లో నటించింది. కానీ సినిమాలు అన్నీ డిజాస్టర్ అవ్వడంతో ఈ బ్యూటీ క్రేజ్ అమాంతం తగ్గిపోయింది. దీంతో కొన్ని రోజుల వరకు టాలీవుడ్‌కు కాస్త బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ మళ్లీ, పుష్ప2 మూవీలో కిసక్కీ అంటూ తన ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది. దీంతో మరోసారి ఈ అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగింది.

ఇక మళ్లీ టాలీవుడ్‌లో వరసగా ఛాన్స్‌లు అందుకుంటూ దూసుకెళ్తుంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ, తాజాగా స్టైలిష్ లుక్‌లో ఉన్న బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసింది.

తాజాగా శ్రీలీల తన ఇన్ స్టా గ్రామ్‌లో స్టైలిష్ లుక్‌లో, హీటెక్కించే చూపులతో, గ్లామర్ డోస్ పెంచి, అదిరిపోయే స్టిల్స్ ఇస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. ట్రెండీ వేర్‌లో తన క్యూట్ లుక్స్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.